Begin typing your search above and press return to search.
వైఎస్ సునీత ప్రశ్నల పరంపర!... ఆన్సర్లు దొరుకుతాయా?
By: Tupaki Desk | 24 March 2019 4:05 PM GMTదివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై అసలు కారణాలను విస్మరించేసి, ఈ హత్యను రాజకీయం చేసేస్తున్న వైనం నిజంగానే విస్మయం కలిగిస్తోందని చెప్పక తప్పదు. మాజీ ఎంపీగా, మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన వివేకా హత్యకు గురైతే... దీనిపై నిష్పాక్షిక విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి అనుకూలంగా వ్వవహరిస్తున్న ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగితే.. తమకు న్యాయం జరగదని అటు వైఎస్ జగన్ తో పాటు వివేకా కూతురు డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో వీరు తమకు అందుబాటులోని అన్ని మార్గాలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే వీరి వాదనను కనీసం వినడానికి కూడా సిద్ధంగా లేని చంద్రబాబు సర్కారు... ఏపీ పోలీసులతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో విచారణ పూర్తి కాకుండానే హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్యను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో కేసుపై తనకు ఉన్న అనుమానాలను వ్యక్తం చేస్తూనే.. సీఐ కేంద్రంగానే కుట్ర జరిగిందా? అన్న కోణంలోనూ వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చిన సునీత... చాలా ప్రశ్నలనే సంధించారు. మరి ఈ ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో? అసలు సమాధానాలు వస్తాయా? రావా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా సునీత సంధించిన ప్రశ్నల విషయానికి వస్తే... వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి పది రోజులు దాటినా ఒక్క క్లూ దొరకలేదని, విచారణ సరైన పద్ధతిలో నడుస్తుందో లేదో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
*సంఘటనా స్థలంలో సీఐ శంకరయ్య ఉన్నారు.. అయినా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చింది.. ఆయనొక ఇన్‌స్పెక్టర్, ఆయనకు కేసు పెట్టాలని తెలియదా. అది హత్య అని సీన్ లో లేని మాకు అనుమానం వస్తోంది. సీన్ లో ఉన్న ఆయనకు మేము చెప్పాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆయన ఏదన్నా కవర్ చేయాలని ప్రయత్నించాడా?. ఎందుకు అతను అలా ప్రవర్తించాడు?. ఆయన సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారు. కట్లు కూడా కట్టారు. సీఐకి తెలియదా అది తప్పు అని. పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ ఏమి చేశారు. ఎందుకు అలా జరిగేలా చేశారు. అక్కడున్న మా ఫ్రెండ్స్, బంధువులకు షాక్ లో ఏమీ అర్థం కాలేదు అనుకుందాం! మరి అన్నీ తెలిసిన సీఐ గారికి ఏమైంది?. ఆయనకు రూల్స్ బాగా తెలుసు కదా.. ఆయన కూడా ఈ క్రైమ్ లో ఏమైనా భాగస్వామ్యులా?. ఆయనకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయన పైన ఎవరున్నారు?. లేదా ఆయనే నేరుగా దీనిలో ఉన్నారా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి. కానీ దీనికి జవాబు దొరకడం లేదు. అసలు విచారణలో ఏమి జరుగుతోంది. అధికారులను ఎవరైనా తప్పు దోవ పట్టిస్తున్నారా. దానికోసం మా కుటుంబంపై నిందారోపణలు వేస్తున్నారా. త్వరలో నాకు సమాధానం దొరుకుతుందనుకుంటున్నా* అని ఆమె వ్యాఖ్యానించారు. అన్నారు.