Begin typing your search above and press return to search.

వైఎస్ జ‌గ‌న్‌ కు త‌ల్లి, భార్య వినూత్న సంఘీభావం

By:  Tupaki Desk   |   27 Jan 2017 4:46 AM GMT
వైఎస్ జ‌గ‌న్‌ కు త‌ల్లి, భార్య వినూత్న సంఘీభావం
X
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చిన వైఎస్‌ ఆర్‌ సీపీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనూహ్య రీతిలో కుటుంబ సభ్యులు సంఘీభావం ప్రకటించారు. ఆర్కే బీచ్‌ లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వైఎస్ జ‌గ‌న్ వెళ్ల‌గా ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీ ప్ర‌జ‌ల‌ ఆకాంక్ష‌కు మ‌ద్ద‌తుగా జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌ లోని త‌మ నివాసంలో సంఘీభావ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. హైదరాబాద్‌ లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయన తల్లి - వైఎస్ ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ - ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డి కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు మద్దతు ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా విజయమ్మ - భారతీ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నిర్విరామ కృషిచేస్తున్నార‌ని అందుకే కేవ‌లం నామ‌మాత్ర‌పు ప్ర‌క‌ట‌న చేసి వ‌దిలిపెట్ట‌కుండా కద‌న‌రంగంలోకి దూకాడ‌ని తెలిపారు. విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్బంధించిన సమయంలో ఆయనకు సంఘీభావంగా, జ‌గ‌న్ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించామ‌ని వివ‌రించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు కోరారు. ప్రత్యేక హోదా రావాలని - దీనివల్ల ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఫలించాలని కోరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ పోరాటం చేస్తున్న వారంద‌రికీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ అండ‌గా ఉంటార‌ని పిలుపునిచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వంలో చ‌ల‌నం తీసుకువ‌చ్చేందుకు చైత‌న్యవంతులైన ఏపీ ప్ర‌జ‌లు గ‌ళం విప్ప‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని పేర్కొన్నారు. ఆ ప్ర‌క్రియ‌లో కొవ్వొత్తుల ర్యాలీ బీజం వేసింద‌ని వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/