Begin typing your search above and press return to search.
షర్మిల చేతికి బలమైన గాయం.. పోలీసులు వదల్లేదు?
By: Tupaki Desk | 16 April 2021 12:37 AM GMTతెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టిన షర్మిలకు పోలీసులు చెక్ చెప్పారు. దీక్ష భగ్నం చేయడంతో ఆమె లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. ఒక దశలో పోలీసులు చుట్టుముట్టడంతో షర్మిల సృహతప్పి పడిపోయారు. షర్మిల చేతికి బలమైన గాయమైందని తెలిసింది.
లోటస్ పాండ్ కు పోలీసులు షర్మిలను తరలించారు. వైద్య బృందం వచ్చి షర్మిలను పరీక్షించింది. ఆమె అభిమానులు భారీగా తరలివచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తనకు గాయం కావడంతో మంచినీళ్లు కూడా ముట్టబోనని షర్మిల శపథం చేశారు. మరోసారి తనపై చేయిపడితే ఊరుకోబోమని షర్మిల హెచ్చరించారు.
-పోలీసులపై విజయలక్ష్మీ ఫైర్
తెలంగాణ ప్రజల కోసం షర్మిల పోరాడుతుంటే పోలీసులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు దారుణమని షర్మిల తల్లి విజయలక్ష్మీ హెచ్చరించారు. షర్మిల పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. పోలీసులు హింసాత్మకంగా ప్రవర్తిస్తే ఆందోళనలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు.