Begin typing your search above and press return to search.
విజయమ్మ ఆనందాన్ని అలా చూడాల్సిందే!
By: Tupaki Desk | 30 May 2019 8:20 AM GMTఏపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన అంశం ఏమైనా ఉందంటే అది జగన్ తల్లి విజయమ్మ ఆనందం. జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత గవర్నర్ కు వీడ్కోలు పలికేందుకు వేదిక దిగి కిందకు వెళ్లారు.
అనంతరం వేదిక మీదకు వచ్చారు జగన్. ఆయన నడుచుకుంటూ వచ్చిన జగన్.. నేరుగా తల్లి విజయమ్మ వద్దకు వెళ్లారు. ఆమె అప్యాయంగా జగన్ ను దగ్గరకు తీసుకొని.. ముద్దు పెట్టుకున్నారు. కొడుకు మీద తనకున్న ప్రేమాభిమానాల్ని ఆమె ప్రదర్శించారు. విజయమ్మ ముఖంలో కనిపించిన ఆనందం.. ఆమె భావోద్వేగం సభికులందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
తెలుగు రాష్ట్రంలో భర్తను, కొడుకును ముఖ్యమంత్రిగా చూడగలిగిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు విజయమ్మ. ఈ అదృష్టం తెలుగు వారిలో ఎవరికీ దగ్గలేదు. భువనేశ్వరికి కూడా ఓ రికార్డు ఉంది. ఆమె తండ్రిని, భర్తను ముఖ్యమంత్రిగా చూసిన ఏకైక మహిళ.