Begin typing your search above and press return to search.
విజయమ్మ మాట!..హోదా 5 కోట్ల ఆంధ్రుల హక్కు!
By: Tupaki Desk | 8 April 2018 8:41 AM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం సాగుతున్న ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర విభజనతో అన్ని రకాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు ఇస్తామని ప్రకటించిన ప్రత్యేక హోదాను తక్షణమే ప్రకటించాలని సాగుతున్న పోరులో పార్లమెంటు సమావేశాల్లో మొక్కుబడి ఆందోళనలు చేసిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు ఇంటికి చేరిపోయారు. అయితే అందుకు విరుద్ధంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ లోక్ సభ సభ్యులు... ఢిల్లీలోనే ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించగానే... అప్పటికే జేబులో రాజీనామా పత్రాలను పెట్టుకుని మరీ సమావేశాలకు హాజరైన వైసీపీ ఎంపీలు అక్కడికక్కడే రాజీనామాలను స్పీకర్ కు సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్ కు వచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి అండ్ కో... నిరాహార దీక్షలకు దిగారు. తొలి రోజు దీక్షలకు ఈదురు గాలులు అడ్డు తగిలినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని వైసీపీ ఎంపీలు హోదా కోసం తాము చేస్తున్న పోరాటంలోని సత్తాను చాటారు.
ఈ క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురి కాగా... ఆయనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలు చేపడుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో వైఎస్ విజయమ్మ ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్న విజయమ్మ నేరుగా ఏపీ భవన్ వెళ్లి దీక్షలో కూర్చున్న ఎంపీలకు సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత తమ పార్టీ ఎంపీల దీక్షలు - ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అటు నరేంద్ర మోదీ సర్కారుతో పాటు ఇటు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని విజయమ్మ కుండబద్దలు కొట్టారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ నాయకులు - కార్యకర్తలు - అభిమానులు మొదటి నుంచి ప్రత్యేక హోదాకై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని - హోదా ముగిసిపోయిన అధ్యాయం కాదని - ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని ఆమె అన్నారు. ఇందుకోసం గడచిన నాలుగేళ్లుగా వైఎస్ జగన్ యువభేరీలు - ఆమరణ దీక్షలు - సభలు నిర్వహించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకున్నారని ఆమె విమర్శించారు. గతంలో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా మైక్ కట్ చేశారని, ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా అదే జరిగిందని మండిపడ్డారు. 12 సార్లు అవిశ్వాసం పెడితే, చర్చకు రాకుండా చేసిన ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. అయినా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదని, పోరాడితే కచ్ఛితంగా ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ నాయకుడు చేయని పని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారని - ఎంపీలతో రాజీనామాలు చేయించి ఆమరణ దీక్షకు కూర్చోపెట్టారని పేర్కొన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే నాయకులు ఇప్పటి వరకూ ఏం చేశారంటూ ఆమె ప్రశ్నించారు. ఆగమేఘాల మీద రాష్ట్రాన్ని విభజన చేశారని, కానీ విభజన హామీల అమలు మాత్రం మరచిపోయారని అన్నారు. ప్రస్తుతం రాజకీయ విలువలు పడిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం ఆమరణ దీక్షకు కూర్చున్న వారితో చర్చించడానికి కూడా ప్రభుత్వాలు రాలేదని వైఎస్ విజయమ్మ విమర్శించారు. దీక్షలో ఆరోగ్యం క్షీణించిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హోదా వచ్చే వరకూ ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వెనుక ఒకటి.. ముందు ఒకటి మాట్లాడటం, వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటు అంటూ విజయమ్మ తనదైన శైలి విమర్శలు గుప్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి - ఆయన తనయుడు వైఎస్ జగన్ కు అలాంటి అలవాటు లేదని చంద్రబాబుకు చురకలంటించారు. పాదయాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశారని, ఎక్కడెక్కడ - ఎవరెవరికి ఏం కావాలో స్పష్టంగా తెలుసుకున్నారని, ఇప్పడు తండ్రి లాగే రాజన్న బిడ్డ సైతం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని ఆమె తెలిపారు. వైఎస్‌ఆర్ కంటే వైఎస్ జగన్ మెరుగైన పరిపాలన అందించగలరని వైఎస్ విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.