Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ 'అనుభ‌వం' మాట‌కు విజ‌య‌మ్మ పంచ్‌!

By:  Tupaki Desk   |   29 Jan 2018 6:00 AM GMT
ప‌వ‌న్ అనుభ‌వం మాట‌కు విజ‌య‌మ్మ పంచ్‌!
X
త‌మ మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ‌. ఈ సంద‌ర్భంగా ఆమె నోటి వెంట ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నోటి నుంచి అదే ప‌నిగా వ‌స్తున్న అనుభ‌వం మాట తెలిసిందే. ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకురాకున్నా.. మాట‌ల మ‌ధ్య‌లో చంద్రాబుకున్న అనుభ‌వం మీద మాట్లాడిన ఆమె.. అనుభ‌వంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నాయ‌కుడికి అనుభ‌వం కొంత‌మేర ఉప‌యోగ‌ప‌డొచ్చేమో కానీ అదే మొత్తం కాద‌న్న మాట చెప్పారు. అంతేనా.. నాయ‌కుడు కావాల‌నే వ్య‌క్తికి మాన‌వ‌త్వం చాలా ముఖ్య‌మ‌ని.. అలా ఉన్న‌ప్పుడే ఏమైనా చేయ‌గ‌లుగుతార‌ని చెప్పారు. అనుభ‌వం అంటున్నారు.. త‌న పాల‌న‌లో చంద్ర‌బాబు దేన్లో చూపించారంటూ ప్ర‌శ్నిస్తూ.. హైకోర్టు క‌ట్టారా? అసెంబ్లీ క‌ట్టారా? అంటూ సూటిగా ప్ర‌శ్నాస్త్రాల్ని సంధించారు.

ప‌వ‌న్ నోటి వెంట అనుభ‌వం అను మాట‌ను అదే ప‌నిగా వ‌స్తుంటుంది. అనుభ‌వం ఒక్క‌టే అధికారాన్ని చేప‌ట్ట‌టానికి అర్హ‌త కాకూడ‌దు. పాల‌కుడికి మాన‌వ‌త్వం చాలా ముఖ్యం. అది లేని పాల‌కుడికి ఎంత అనుభ‌వం ఉంటే మాత్రం ఎందుకు ప‌నికి రాద‌న్న విష‌యాన్ని విజ‌య‌మ్మ చెప్పిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌టం ఖాయం.

విజ‌య‌మ్మ మాట‌ను చూస్తే.. మ‌రో విష‌యం కూడా అర్థంకాక మాన‌దు. అనుభ‌వం ఉన్న నేత రాజ‌కీయాల్లో స‌త్ సంప్ర‌దాయాల్ని పెరిగేలా చేయాలే కానీ.. అడ్డ‌గోలు రాజ‌కీయాలు ప‌నికిరావు. అంత అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు.. విప‌క్షానికి చెందిన ఎమ్మెల్యేల్ని ఎందుకు కొనుగోలు చేసిన‌ట్లు? ఒక‌వేళ పార్టీలో చేర్చుకుంటే.. వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి గెలిపించుకోవ‌చ్చు క‌దా?

అనుభ‌వం అనే మాట‌లు చెప్పే పెద్ద మ‌నుషులు విలువ‌ల గురించి ఎందుకు మాట్లాడ‌రు? అన్న ప్ర‌శ్న వేసుకుంటే.. విజ‌య‌మ్మ మాట‌ల్లో వాస్త‌వం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ప‌ద‌వులు చేప‌ట్ట‌టానికి అనుభ‌వం కంటే కూడా మాన‌వ‌త్వం ఉండ‌టంముఖ్యం..పేదోళ్లకు ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న.. రాష్ట్ర ముఖ‌చిత్రాన్ని మారుస్తుందే త‌ప్పించి.. అనుభ‌వం ఎంత ఉన్నా.. మన‌సులో మాన‌వ‌త్వం లేన‌ప్పుడు ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న‌ది నిజం.