Begin typing your search above and press return to search.
వైఎస్ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదు: విజయమ్మ ఎమోషనల్
By: Tupaki Desk | 8 July 2021 1:39 PM GMTవైఎస్ఆర్ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదని వైఎస్ విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగానికి గురైతూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్బావ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. దోచుకోవడం.. దాచుకోవడం తన బిడ్డలకు తెలియదని.. పంచడం, సాయం చేయడమే వారికి తెలుసని అన్నారు.
మాట ఇస్తే ముందుకెళ్లడం తండ్రి వైఎస్ఆర్ నుంచి షర్మిల నేర్చుకుందని విజయమ్మ అన్నారు. వైఎస్ వచ్చాక తుపాకుల మోతలు ఆగిపోయాయని.. పల్లె బతికిందన్నారు. రక్తం కాదు.. నీరు మాత్రమే పారాలన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు అని షర్మిల నమ్ముతోందని వైఎస్ విజయమ్మ అన్నారు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి తన కుమార్తెముందుకొస్తోందని అన్నారు. తన బిడ్డలకు మాట మార్చడం తెలియదని ఇచ్చిన మాటకు ప్రాణం ఇచ్చేవాళ్లలాంటివారని అన్నారు.
వైఎస్ రాకముందు తెలంగాణలో రక్తం మరకులు ఉంటే.. వైఎస్ వచ్చాక ఆ భూముల్లోకి నీళ్లు పారాయని విజయమ్మ అన్నారు. మీ కుటుంబ సభ్యురాలిగా నా బిడ్డను అక్కున చేర్చుకోండని విజయమ్మ కోరారు.
అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని.. తెలుగు రాష్ట్రాలు ఒక్కలే .. రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు.. కానీ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టాలు, బోర్డులను గౌరవించాలని తెలంగాణ ఏపీ జలవివాదాలపై విజయమ్మ సూచనలు చేశారు.
వైఎస్ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందంటే చూసి నేర్చుకోవాలని.. వైఎస్ ను నాయకుడిగా ఒప్పుకోవాల్సిందేనన్నారు విజయమ్మ. వైఎస్ కల్మషం లేని వ్యక్తి. తెలంగాణ సస్యశ్యామలం కావాలని ఆయన నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. బిడ్డలకు బంగారు జీవితం ఇస్తేనే బంగారు తెలంగాణ అయినట్లు అన్నారు విజయమ్మ. రక్తంలో విశ్వసనీయత ఉందని.. ఆయన రక్తంతో పుణికి పుచ్చుకున్నా జగన్ షర్మిల అని.. ఈ పార్టీ దైవ సంకల్పం అని అన్నారు.
తండ్రి కల సాకారం చేసేందుకు షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని..తండ్రి ఆశయ సాధన కోసం మీ ముందుకు వస్తోందన్నారు. మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుందన్నారు. మీ కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకోండని విజయమ్మ అన్నారు.