Begin typing your search above and press return to search.

దస్తగిరి వాగ్మూలం నిలుస్తుందా ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 7:30 AM GMT
దస్తగిరి వాగ్మూలం నిలుస్తుందా ?
X
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటన అనేక మలుపులు తిరుగుతున్నది. హత్యకు అసలు కారణాలను తెలుసుకునేందుకు, హత్యవెనుక ఉన్న అసలు వ్యక్తులను పట్టుకునేందుకు సీబీఐ నానా అవస్తలు పడుతోంది. అనుమానితులందరినీ సీబీఐ విచారించి ఇప్పటికే అనేక చార్జిఫీట్లను కోర్టులో దాఖలు చేసింది. అయితే తాజాగా హత్యవెనుక అసలు కారణం అని, హత్యవెనుక ఎవరున్నారనే విషయాన్ని ఒకపుడు వివేకాకు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి బయటపెట్టారంటు ఓ కథనం బయటకు వచ్చింది.

తనకు తెలిసిన విషయాలను కోర్టులో వాగ్మూలం రూపంలో అన్నీ వివరాలను దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో బయటపెట్టారని తాజా కథనం సారంశం. హత్యలో తనతో పాటు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి పాత్రున్నట్లు దస్తగిరి చెప్పారట. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో వచ్చిన తేడాల వల్లే వివేకా హత్య జరిగినట్లు దస్తగిరి చెప్పారు. రు. 40 కోట్లకు డీల్ జరిగిందని, హత్యవెనుక పెద్దలున్నట్లు తనతో గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి తన వాగ్మూలంలో చెప్పారట.

ఇక్కడే దస్తగిరి వాగ్మూలంగా వెలుగులోకి వచ్చిన విషయాలపై కొన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. అవేమిటంటే దస్తగిరి చెప్పారని వెలుగుచూసిన వాగ్మూలంలో పెద్దలంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డట. హత్యవెనుక పెద్దలున్నారని దస్తగిరికి గంగిరెడ్డి చెప్పటమే కానీ నేరుగా ఆ పెద్దలు దస్తగిరితో మాట్లాడలేదు. హత్యలో తనతో పాటు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు దస్తగిరి చెప్పటం వరకు ఓకే.

ఎందుకంటే హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ కొన్నది, హత్య ఎన్నిగంటలకు చేయాలనే ప్లాన్ చేసిందెవరు, ఇంట్లోకి వెళ్ళటానికి సాయం చేసిందెవరు అనే విషయాలను దస్తగిరి చెప్పటంతో మిగిలిన ముగ్గురి పాత్రను అర్ధం చేసుకోవచ్చు. వివేకాను ముందు సునీల్ యాదవ్ కొట్టారని, తర్వాత గొడ్డలితో కొట్టారని, ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి నరికారని, గొడ్డలిని తనకిచ్చి కొట్టమంటే తాను కూడా చేతులపై కొట్టానని దస్తగిరి చెప్పారు. గంగిరెడ్డితో కలిసి తామంతా వివేకాను బాత్ రూములోకి తీసుకెళ్ళి మళ్ళీ గొడ్డలితో నరికినట్లు చెప్పారు.

అంటే ఇంట్లోకి వెళ్ళగానే వివేకాతో గొడవపడి చేతులతో కొట్టిందెవరు, గొడ్డలితో కొట్టిందెవరు, తలపైన, చేతులపైన, మెడపైన ఎవరెవరు ఎన్ని దెబ్బలేశామనే విషయాన్ని దస్తగిరి చెప్పారు కాబట్టి నమ్మవచ్చు. ఎందుకంటే సీన్ లో ఉన్నది నలుగురు కాబట్టి ఎవరెవరు వివేకాను దేంతో ఎక్కడెక్కడ కొట్టారన్నది దస్తగిరి చెప్పిందే నిజమని అనుకునేందుకు అవకాశముంది. కానీ హత్యవెనుక ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఉన్నారని తనకు గంగిరెడ్డి చెప్పారంటు దస్తగిరి చెప్పిన వాగ్మూలం నిలుస్తుందా ? అన్నదే ప్రశ్న.

ఎందుకంటే హత్య సీనులో వాళ్ళిద్దరు లేరు. హత్య చేయమని కానీ హత్యకు డీల్ మాట్లాడటం కానీ వాళ్ళు చేయలేదు. వివేకా హత్యగురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దస్తగిరితో వీళ్ళిద్దరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నదంతా ఏమిటంటే హత్యవెనుక ఎంపీ, ఆయన తండ్రి ఉన్నట్లు తనతో గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాగ్మూలం చెప్పటమే. వివేకా హత్యకు గంగిరెడ్డితో కలిసి ఎంపీ, ఆయన తండ్రి ప్లాన్ చేశారనేందుకు అవసరమైన సాక్ష్యాలను సీబీఐ సంపాదించగలిగేతేనే దస్తగిరి వాగ్మూలానికి విలువుంటుంది. లేకపోతే రెండు రోజులు సంచలనంగా మారటం తప్ప ఉపయోగమే ఉండదు.