Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్యకేసు: విచారణ కు వైసీపీ ఎంపీ
By: Tupaki Desk | 7 Dec 2019 6:49 AM GMT2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేసింది. నాడు ప్రతిపక్ష నేత హోదా లో జగన్ దీని పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఈ కేసు పై సీరియస్ గా దృష్టి సారించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కేసును సమగ్రం గా విచారిస్తోంది.
ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులైన ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ముగ్గురు బెయిల్ పై విడుదలయ్యారు. వీరిలో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి, నారాయణరెడ్డి లను సిట్ విచారించింది.
తాజాగా ఈ వివేకా హత్య కేసు లో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సిట్ విచారణకు హాజరు కానున్నారు. అలాగే సోమవారం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కూడా సిట్ విచారణ కు హాజరు కావాలని పిలిచినట్టు తెలిసింది.