Begin typing your search above and press return to search.
వివేకా కేసు.. ఎర్ర గంగిరెడ్డి మాస్టర్ ప్లాన్.. ఇదే!
By: Tupaki Desk | 19 Feb 2022 2:30 AM GMTఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అనేక ట్విస్టులు తెరమీదికి వస్తున్నాయి. నెలలు గడిచే కొద్దీ .. కేసు అనేక రూపాలు సంతరించుకుంటోంది.
ఇటీవల సీబీఐ చార్జిషీట్ నమోదు తర్వాత.. కీలక మైన బంధువ ర్గమే.. ఆయనను హత్య చేయించిందనే వాదన వచ్చింది. ముఖ్యంగా ఎర్ర గంగిరెడ్డి విషయం.. మరింత.. వివాదంగా మారింది. ఆయనే ఈ హత్య చేయించాడని.. సీబీఐ దాదాపు నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా గంగిరెడ్డి కోర్టుకు వెళ్లారు. సీబీఐని ఇరకాటంలో పడేసే పనిచేశారు.
ఈ హత్య కేసులో మొదటి నిందితుడిగా ఉన్నఎర్ర గంగిరెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్ అధికారులు సిద్ధం చేసిన రెండు దర్యాప్తు నివేదికలను కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
సీఆర్పీసీ 207 సెక్షన్ ప్రకారం నివేదికలిచ్చేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తమకు అవసరమున్న మేరకే విచారణ నివేదికను తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు కౌంటర్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణను పులివెందుల కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.
మరోవైపు... వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా.. వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు.
హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను.. సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో.. మరోసారి కోర్టులో వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
ఈ హత్య కేసులో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. దస్తగిరిని అప్రూవర్గా మారేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్ కింద మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.