Begin typing your search above and press return to search.
నెల క్రితం వివేకా ఆస్తుల పవర్ ఆఫ్ అటార్నీ మారిందా?
By: Tupaki Desk | 19 March 2019 5:25 AM GMTమాజీ మంత్రి కమ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆయన ఇంట్లో జరిగిన దారుణహత్యకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నలే తప్పించి సమాధానాలు లభించని వేళ.. వివేకాకు సంబంధించిన కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది.
వివేకానంద హత్యకు దారి తీసిన అంశాలు ఏమిటి? అందులో పాత్రధారులుఎవరు? సూత్రధారులు ఎవరు? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. నెల రోజుల క్రితం వైఎస్ వివేకానంద ఆస్తులకు సంబంధించి కొనుగోలు.. అమ్మకాలకు కీలకమైన పవర్ ఆఫ్ అటార్నీ ఒకరికి ఇచ్చిన వైనం వెలుగు చూసింది.
నెల క్రితం వేంపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివేకా పేరుతో ఉన్న వేముల మండలంలోని ఆస్తి అమ్మకం జరిగిందని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆఫీసులో అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.ఈ సందర్భంగా వివేకా ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరిస్తున్న వ్యక్తి వివరాల్ని తెలుసుకున్నారు.
పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం వేముల మండలం దుగ్గన్నగారి పల్లెకు సంబంధించిన ఒక వ్యక్తికి వివేకానంద పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లుగా తేల్చారు.
నెల నుంచి సదరు వ్యక్తే వివేకా ఆస్తులకు సంబంధించిన క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు సేకరించారు. వివేకా దారుణహత్య నేపథ్యంలో ఆయన ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ప్రస్తుతం రద్దు అయినట్లేనని సబ్ రిజిస్టార్ కార్యాలయం చెబుతోంది.
అయితే.. పలువురు ప్రముఖులు తమకున్న ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయాల్లో నేరుగా పాల్గొనరు. తమకు నమ్మకస్తుల్ని తమ పవర్ ఆఫ్ అటార్నీగా పెట్టుకొని కార్యకలాపాలు చేపడుతుంటారు. అయినప్పటికీ.. నెల క్రితమే చోటు చేసుకున్న ఉదంతం కావటంతో పోలీసులు ఆ విషయం మీదా దృష్టి సారించినట్లు చెబుతున్నారు.