Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా మృతిపై అనుమానాలు..పోలీసులకు ఫిర్యాదు
By: Tupaki Desk | 15 March 2019 5:56 AM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. ఆయన అకాల మరణంతో కడప జిల్లాతోపాటు వైఎస్ ఆర్ కుటుంబం - అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
అయితే గురువారం వైసీపీ తరుఫున ప్రచారం ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని పనివారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అకాల మరణంపై అనుమానాలున్నాయని వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు..
వివేకానందరెడ్డి తలపై గాయం ఉండడం.. చనిపోయిన సమయంలో ఒంటరిగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహిస్తే నిజం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.