Begin typing your search above and press return to search.
చనిపోతూ వివేకా లేఖ!..ఎన్ని అనుమానాలో?
By: Tupaki Desk | 15 March 2019 5:24 PM GMTదివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతపై ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన సొంతింటిలో ఒంటరిగా ఉన్న వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో నరికి వివేకాను బెడ్ రూంలోనే చంపేసిన దుండగులు... దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు డెడ్ బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లారు. బాతఠ్ రూంలో కమోడ్ తగిలి చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసిన దుండగులు గుట్టు చప్పుడు కాకుండా తప్పుకున్నారు. ఈ క్రమంలో తెల్లారిన తర్వాత హత్య వెలుగులోకి రాగా... వైఎస్ ఫ్యామిలీ షాక్ లో కూరుకుపోయింది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్యను రాజకీయం చేసేందుకు పక్కాగానే యత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తన చిన్నాన్నను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని - నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయితే దీనిపై జగన్ డిమాండ్ కు ముందే అధికార టీడీపీ కొత్త వాదనను వినిపించడం మొదలెట్టింది. వివేకా హత్యను రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ ఉల్టా వైఎస్ ఫ్యామిలీపైనే నిందలేసిన టీడీపీ నేతలు. మంత్రులు - చివరకు సీఎం నారా చంద్రబాబునాయుడు తమదైన శైలి వాదనను వినిపించారు. ఈ క్రమంలో వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ చుట్టూ కొత్త చర్చ నడుస్తోంది. అసలు తనపై గొడ్డలితో కిరాతకంగా దాడి జరిగితే... స్వయంగా వివేకాను ఎలా లేఖ రాశారన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది. రాత్రి వేళ... ఇంటిలో ఒంటరిగా ఉన్న తనపై దుండగులు దాడికి దిగితే... దాడి తర్వాత వారు వెళ్లిపోయాక వివేకా లేఖ రాసినట్టుగా ఓ వాదన వినిపిస్తోంది. అసలు వివేకాపై దాడి చేసిన దుండగులు ఆయన చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే... డెడ్ బాడీని బాతఠ్ రూంలోకి లాక్కెళ్లి... దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారన్న మరో వాదన వినిపిస్తోంది.
ఒకవేళ వివేకాపై దాడి చేసిన నిందితులు ఆయన మరణించకుండానే వెళ్లిపోయినా... గొడ్డలితో తన శరీరంపై తీవ్ర గాయాలు అయితే... ఆ గాయాల కారణంగా కలుగుతున్న తీవ్ర నొప్పిని తట్టుకుని కూడా వివేకా లేఖ రాసేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయినా వివేకా రాసినట్టుగా చెబుతున్న సదరు లేఖలో వివేకా ఏం రాశారన్న విషయంలోకి వస్తే... *నా డ్రైవరు... నేను డ్యూటీకి తొందరగా నమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టొద్దు... ఇట్లు వివేకానందరెడ్డి* అని ఆ లేఖలో ఉన్నట్లుగా ఇటు పోటీసులతో పాటు అటు టీడీపీ సర్కారు చెబుతోంది. మరి ఈ వాదన కరెక్టా? లేదంటే... కేసును తప్పుదోవ పట్టించి - హత్యను వైసీపీపైనే నెట్టేసేందుకు జరుగుతున్న కుట్రా? అన్నది తేలాల్సి ఉంది.