Begin typing your search above and press return to search.
జగన్ శాశ్వత అధ్యక్షుడు : కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుంది...?
By: Tupaki Desk | 9 July 2022 3:06 PM GMTఏ పార్టీకైనా సొంతంగా రాజ్యాంగం ఉంటుంది. దాని ప్రకారం వారు పదవులు ఇచ్చుకుంటూ ఉండవచ్చు. అలాగే వాటి కాల పరిమితిని కూడా సొంతంగా నిబంధలన మేరకు పెట్టుకోవచ్చు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలను కొన్ని ఉంటాయి. అక్కడ రిజిష్టర్ అయిన పార్టీలు వాటి ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ముచ్చటగా మూడవసారి జరిగిన వైసీపీ ప్లీనరీలో హైలెట్ ఏంటి అంటే జగన్ని ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా చేస్తూ తీర్మానించడం. అంటే ఇక మీదట వైసీపీలో ఎన్నికలు అన్నవే ఉండవు. ప్రెసిడెంట్ గా జీవితకాలానికి జగనే ఉంటారు.
ఈ విధంగా పార్టీ రాజ్యాంగాన్ని మార్చి మరీ వైసీపీ జగన్ని ఎన్నుకుంది. జగనే వైసీపీ అని వేరేగా చెప్పాల్సింది లేదు కానీ ఈ తీర్మానంతో అది ఇంకా బలపడింది. నిజానికి ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్ అయిన పార్టీలు నిబంధలను పక్కాగా అనుసరించాలి. క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు అధ్యక్ష స్థానం నుంచి దిగువ దాకా నిర్వహించాలి.
అలాగే పార్టీ అజెండాతో పాటు, సమావేశాల నిర్వహణ, ఖర్చులు, విరాళాలు ఇలా అన్నీ కూడా ఎప్పటికపుడు తెలియచేయాల్సి ఉంటుంది. ఇపుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు అధినాయకులను ఎన్నుకునేటపుడు లాంచనంగా ఎన్నికలు అని ఒక తతంగాన్ని నిర్వహిస్తాయి. సాధారణంగా ఇదంతా ముందే ఒక మాట అనుకుని ఆ మేరకే జరిగిపోతుంది.
కానీ ప్రజాస్వామ్య స్పూర్తి కోసం అలా చేస్తారు. మహానాడు వేదికగా టీడీపీ అధ్యక్షుడిని ఎపుడూ ఎన్నుకుంటుంది. అలాగే ఇతర పార్టీలలో ఇదే విధానం ఉంది. అయితే వైసీపీ మాత్రం శాశ్వత అధ్యక్షుడు అన్న కొత్త ప్రతిపాదన తెచ్చింది. దానికి వారి పార్టీ వారే కాబట్టి జై కొట్టేశారు.
జగన్ లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ కూడా అయిపోయారు. అంతా బాగానే ఉన్నా దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇక్కడ ఉత్కంఠ. అయితే పొరుగున ఉన్న తమిళనాడులో డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధిని ఎన్నుకున్నారు. దాని మీద ఎన్నికల సంఘానికి తమ నిర్ణయాన్ని తెలియచేస్తే ఆమోదముద్ర వేసింది అని అంటున్నారు.
ఇపుడు డీఎంకే కేసునే ఉదహరణగా తీసుకుని జగన్ కూడా శాశ్వత ప్రెసిడెంట్ అయిపోయారు. కరుణానిధి ఎన్నికను నాడు ఆమోదించారు కాబట్టి తనకు కూడా ఇబ్బంది లేదని వైసీపీ భావిస్తోంది. మరి దీని మీద ఎన్నికల సంఘం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే 2011 మార్చిలో ఆవిర్భవించిన వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా, తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షుడిగా ఈ రోజు దాకా ఉన్నారు. ఇపుడు విజయమ్మ రాజీనామా చేయడం, జగన్ శాశ్వత అధ్యక్షుడు కావడం వైసీపీలో సరికొత్త పరిణామం. వైసీపీకి ముందు జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించారు. అది జనాదరణను పొంది ఈ రోజు అధికారంలో ఉంది.