Begin typing your search above and press return to search.
ఉద్యోగులకు వసతి విషయంలో జగన్ సర్కార్ పిల్లిమొగ్గలు వేసిందా?
By: Tupaki Desk | 30 Jun 2022 3:10 AM GMTఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాకులు మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు జీపీఎఫ్ నిధులు 800 కోట్ల రూపాయలను వారి ఖాతాల నుంచి వెనక్కి తీసకుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వసతి విషయంలోనూ జగన్ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది.
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన సచివాలయ, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిపై జగన్ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్టు జూన్ 29న ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ వెంటనే వెనక్కి తగ్గింది.
మరో రెండు నెలలు.. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉచిత వసతిని పొడిగిస్తున్నట్టు జూన్ 29 బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది. అలాగే అనుమతించిన ఉచిత వసతిని ఉద్యోగులు షేరింగ్ ప్రాతిపదికన వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది.
ఉద్యోగులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత వసతి సౌకర్యం రద్దు చేస్తున్నామని ముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో జగన్ సర్కారు పేర్కొంది. జూన్ 30న ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వారు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ మొదట ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి.. మంచి స్థితిలో అప్పగించాలని ఆదేశించింది. ఏదైనా నష్టం జరిగితే ఉద్యోగులే వాటిని మరమ్మతు చేసి ఇవ్వాలని పేర్కొంది.
చేసి ఇవ్వకపోతే వారి జీతాల్లో నుంచి మరమ్మతులకయ్యే ఖర్చును తగ్గిస్తామని వెల్లడించింది. దీనిపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వారినుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉచిత వసతిని మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రాత్రి మళ్లీ సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. అత్యంత కీలకమైన సచివాలయం, వివిధ విభాగాధిపతులఉద్యోగులకు కొనసాగుతున్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం జూన్ 27తో ముగిసింది. మరి, ఇకమీదట ఎలాంటి విధానం కొనసాగనుంది అనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గడువు ముగిసి రెండు రోజులైనా.. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో.. ఐదు రోజుల పనిదినాల విధానం కొనసాగుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొందని తెలుస్తోంది.