Begin typing your search above and press return to search.

తీర్చని సమస్యలపై అమిత్ షాను జగన్ ఎందుకు కలిసినట్టు?

By:  Tupaki Desk   |   30 Dec 2022 12:30 AM GMT
తీర్చని సమస్యలపై అమిత్ షాను జగన్ ఎందుకు కలిసినట్టు?
X
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ నిన్న ప్రధాని మోడీని కలిసి ఏపీ సమస్యలపై విన్నవించారు. ఆయనకు వేంకటేశ్వరుడి భారీ విగ్రహాన్ని అందించి మరీ తమ సమస్యలు తీర్చాలని వేడుకున్నారు. అదే కోవలో హోంమంత్రి అమిత్ షాను అపాయింట్ మెంట్ అడిగారు. కానీ రాత్రి వీలుకాకపోవడంతో గురువారం ఉదయం అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. 20 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చారు.

కేంద్రహోంమంత్రి కేవలం కొన్ని శాఖల పరిధిమేరకే పనిచేస్తారు. అన్నింటిని కంట్రోల్ లో ఆయనకు ఉండవు. కానీ అమిత్ షాను కలిశాక జగన్ సర్కార్ విడుదల చేసిన ప్రకటన చూస్తే అలివి కానీ సమస్యలను అమిత్ షా ముందు జగన్ ఉంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోడీకి విన్నవించిన సమస్యలు అన్నింటిని అమిత్ షా వద్ద ప్రస్తావించారని.. అవి తీర్చాలని కోరారట..

పోలవరం ప్రాజెక్టు నిధుల దగ్గర నుంచి.. తెలంగాణకు ఇవ్వాల్సిన కరెంట్ బకాయిల వరకూ అన్నింటిని ప్రస్తావించారు. వాటన్నింటిని పరిష్కరించాలని కోరారు. జగన్ దాదాపు 12 అంశాలపై విజ్ఞప్తులు చేస్తే అందులో అమిత్ షా పరిష్కరించేవి కేవలం హోంశాఖకు సంబంధించినది ఒకే ఒక్కటి కావడం విశేషం.

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ను తిరుపతిలో పెట్టాలని కోరారు. ఇది తప్ప హోంశాఖకు అమిత్ షాకు సంబంధం లేనివే అన్నీనూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలు, 10వ వేతన సంఘం బకాయిలు ఇలా రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని.. వీటిని వెంటనే మంజూరు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు.

పోలవరం ఖర్చు, ఆహార భద్రతా చట్టంలో మార్పులు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం, ప్రత్యేక తరగతి హోదా ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. విశాఖ మెట్రో రైల్ డీపీఆర్ ఇవ్వలేదని కేంద్రం అంటుంటే దాన్ని మీద అడిగినట్టు సీఎం పీఆర్వో లేఖ విడుదల చేయడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

దీన్ని బట్టి అమిత్ షాను జగన్ లోపల అడిగింది వేరని.. అది చెప్పకుండా ఏవేవో కథలపై అడిగినట్టు లేఖ విడుదల చేశారని అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.