Begin typing your search above and press return to search.
ఇవి తేలని కేసులు.. మర్మం జగన్‌కే ఎరుక బ్రో!!
By: Tupaki Desk | 20 Dec 2022 10:30 AM GMTవైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటి మర్మం ఏంటో.. వాటి వెనుక ఎవరున్నారో.. ఇప్పటి వరకు ఇటు పోలీసులు కానీ, అటు ప్రభుత్వం కానీ.. బయట పెట్టలేదు. కనీసం.. బయటపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. మచ్చుకు మూడు ఘటనలు పరిశీలిస్తే.. అసలు ఇవి ఎలా జరిగాయంటే.. చెప్పడానికి మాటలు.. చాలవు.
అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరిని విభజిస్తూ.. మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. అయితే, రెండు జిల్లాల విషయంలో ఎలాంటి అభ్యంతరం రాలేదు. కానీ, కోనసీమ విషయంలో నోటిఫికేషన్ ఇచ్చి.. జిల్లా కూడా ఏర్పడిన తర్వాత.. పేరు మారుస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కోనసీమ జిల్లాను డాక్టర్ అంబేడ్కర్ కోనసీమగా మార్పు చేసింది. అంతే.. ఒక్కసారిగా ఇక్కడ అల్లర్లు చెలరేగాయి. ఏకంగా.. మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం సహా.. పార్టీ ఎమ్మెల్యే ఇంటిని కూడా ఆందోళన కారులు తగలబెట్టారు. ఇది దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. కట్ చేస్తే.. ఇప్పటి వరకు ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు? అనేది మాత్రం తేల్చలేదు.
తిరుపతి: తిరుపతి పార్లమెంటుకు ఈ ఏడాది ప్రారంభంలో ఉప ఎన్నిక జరిగింది. అయితే.. ఈ ఉప ఎన్నికలో ఓట్లు వేసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఓటర్లు వందల బస్సుల్లో తరలి వచ్చారు. వారు అసలు స్థానికులే కాదని.. ఆధారాలు.. పత్రాలతో సహా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ప్రధాన మీడియా ఘోషించింది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు. కోర్టులోనూ కేసులు వేశారు.
కానీ, ఇది తేలితేనా? అసలు వచ్చిన వారు ఎవరు? ఎవరు తీసుకువచ్చారు? అనేది ఈ భూమి ఎప్పుడు పుట్టిందన్న రహస్యం మాదిరిగా .. ఇప్పటికీ తేలకపోవడం గమనార్హం.
మాచర్ల: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్లలో ఇప్పుడు జరిగిన మారణ హోమం పక్కన పెడితే.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరిశీలకులుగా వెళ్లిన విజయవాడకు చెందిన బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై ఏకంగా.. కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. ఇలా చేసింది ఎవరు? అంటే.. కేవలం మీడియాకు మాత్రమేతెలుసు. ఇటు పోలీసులుకానీ, అటు ప్రభుత్వం.. 'ఎవరో తెలియని ఆగంతుకులు' అని సరిపుచ్చారు. ఇదీ.. సంగతి. మరి ఈ మర్మాలు.. ఎవరికి తెలుసు! అని అడిగితే ఏం చెబుతాం!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.