Begin typing your search above and press return to search.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటేయ‌క‌పోతే ప‌థ‌కాలు క‌ట్‌: వైసీపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   7 Oct 2022 7:14 AM GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటేయ‌క‌పోతే ప‌థ‌కాలు క‌ట్‌:  వైసీపీ ఎమ్మెల్యే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోమారు విజ‌య ఢంకా మోగించాల‌ని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్క‌కు మిక్కిలిగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేరుస్తాయ‌ని ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నుంచి చోటా నేత‌ల వ‌ర‌కు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌ని వైఎస్ జ‌గ‌న్.. త‌న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్భోదిస్తున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివ‌రిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రాసిన లేఖ‌ను కూడా ప్ర‌జ‌ల చేతుల్లో పెడుతున్నారు. అయితే చాలా చోట్ల త‌మ‌కు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని, ల‌బ్ధిదారుల జాబితాలో త‌మ పేరు లేద‌ని.. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే తిష్ట వేశాయ‌ని.. గెలిచిన మూడున్న‌రేళ్ల త‌ర్వాత తాము గుర్తొచ్చామా అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తుండ‌టంతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిర‌వుతున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక చేతులెత్తేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రికొంత‌మంది పోలీసుల‌తో త‌మ‌ను ప్ర‌శ్నించిన వారిపై కేసులు పెట్టించ‌డం, ద‌బాయించ‌డం, బెదిరించ‌డం వంటివి చేస్తున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా కాకినాడ జిల్లా ప్ర‌త్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే ప‌ర్వ‌త ప్ర‌సాద్ కూడా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. శంఖవరం మండలం.. అన్నవరం వెల్లంపేటలో గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలో సంక్షేమ‌ పథకాల లబ్దిదారులతో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ అవుతాయ‌ని అన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటి వరకు చోటా మోటా నాయకులే ఇలా భయపెట్టేవారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే పథకాల పేరుతో బెదిరించ‌డం స‌రికాద‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఓటేయ‌క‌పోతే ప‌థ‌కాలు క‌ట్ చేస్తామంటూ బెదిరించ‌డం ఏమిట‌ని ప్ర‌జ‌లు వాపోయార‌ని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.