Begin typing your search above and press return to search.

అలా చేసి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న బెజవాడ వైసీపీ మహిళా నేత

By:  Tupaki Desk   |   24 Nov 2022 4:31 AM GMT
అలా చేసి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న బెజవాడ వైసీపీ మహిళా నేత
X
సంచలన ఆరోపణను ఎదుర్కొంటున్నారు విజయవాడకు చెందిన ఏపీ అధికార పార్టీకి చెందిన మహిళా నేత ఒకరు. ఇదేదో రాజకీయంగా అనే కన్నా.. సదరు మహిళా నేత వ్యక్తిగత ప్రతిష్ట.. పరపతిని దారుణంగా దెబ్బ తీసే ప్రమాదం ఉందంటున్నారు. తాజాగా పోలీసు ఉన్నతాధికారికి ఇద్దరు యువతులు కంప్లైంట్ ఇవ్వటంతో తాజా ఉదంతం బయటకు వచ్చింది. ఇంతకూ జరిగిందేమంటే..

విజయవాడ నగర సీపీ కాంతిరాణ టాటా వద్దకు వచ్చిన ఇద్దరు యవతులు.. ఒక కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ మహిళా నేత ఒకరు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారని.. దుర్మార్గమైన పద్దతుల్లో వారిని ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వైసీపీ మహిళా నేత ఒకరు విజయవాడలోని పడమట ప్రాంతంలో ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారని.. అలా వచ్చిన వారిలో కొందరు యువతులు ట్రైల్ రూంలో బట్టలు మార్చుకునే సమయంలో వారి ఫోటోల్ని సీక్రెట్ గా తీస్తుందని ఆరోపిస్తున్నారు.

అలా సేకరించిన ఫోటోలతో సదరు అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని పేర్కొన్నారు. వారిని బెదిరింపులకు గురి చేసి.. వారిని వ్యభిచారంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారరు. ఇప్పటికే పలువురు యువతుల్ని ఇదే రీతిలో సదరు మహిళా నేత వ్యభిచారంలోకి దించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంపై మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ విజయవాడ సీపీ కాంతిరాణకు ఫిర్యాదు చేశారు ఇద్దరు అమ్మాయిలు. మరి.. వీరి ఫిర్యాదుపై పోలీసులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.