Begin typing your search above and press return to search.
ఆ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. మెజారిటీ గొప్ప.. పనితనంలో దిబ్బ!
By: Tupaki Desk | 6 Feb 2020 2:30 PM GMTపులివెందుల నియోజకవర్గం తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి భారీ మెజారిటీని ఇచ్చింది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ప్రజలే. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వీచిన జగన్ గాలి పులివెందుల తర్వాత గిద్దలూరులోనే భారీగా ఓట్లను రాల్చింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ సంగతెలా ఉన్నా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్న నియోజకవర్గం గిద్దలూరు. 2014లోనూ ఇక్కడ వైసీపీ మంచి మెజారిటీతో నెగ్గింది, గత ఎన్నికల్లో అయితే మెజారిటీ మోగిపోయింది.
మరి అలాంటి చోట వైసీపీ చేపట్టే కార్యక్రమాలు ఎలా జరగాలి? పఆర్టీ పిలుపును ఇచ్చిన కార్యక్రమాలు ఎలా జరగాలి? అది ఊహించుకోవడం సులభమే. అయితే అలా ఊహకు భిన్నంగా - అత్యంత పేలవంగా పార్టీ కార్యక్రమాలను - ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్న నియోజకవర్గంగా నిలుస్తోంది గిద్దలూరు.
మూడు రాజధానులు ఫార్ములా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పిలుపును ఇచ్చింది. ఇప్పటి వరకూ అందుకు అనుగుణంగా ఆరేడు రకాల కార్యక్రమాలను చేపట్టాలని పిలుపును ఇచ్చింది. అందులో భాగంగా మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత - ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ గిద్దలూరులో పై ఫొటోలో చూపిన విధంగా జరిగింది. అత్యంత పేలవంగా ఏ మాత్రం స్పందన లేకుండా ఆ కార్యక్రమం జరిగింది.
మూడు రాజధానుల ఫార్ములా విషయంలో నారా వారి పల్లెలో కూడా భారీ ఎత్తున ప్రోగ్రామ్ జరిపింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు సొంత ఊరిలోనే అలా వైసీపీ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి సత్తా చూపింది. అయితే.. పులివెందుల తర్వాత వైసీపీకి భారీ మెజారిటీ దక్కిన గిద్దలూరులో మాత్రం ఆ సందడి కనిపించలేదు.
దీనికంతటికీ కారణం ఎమ్మెల్యే అన్నా రాంబాబే అనే అభిప్రాయాలు స్థానిక క్యాడర్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పార్టీ పునాదులను దెబ్బతీయడానికి ఎంత చేయాలో అంతా చేశాడట అన్నా రాంబాబు. పార్టీకి అండగా ఉండే వారిని, తను వైసీపీలోకి చేరకముందే పార్టీ తరఫున నిలిచి పని చేసిన వారిని ఈయన తీవ్రంగా నిర్లక్ష్యం తెలుస్తోంది. పార్టీ క్యాడర్ ను అలా చల్లాచెదురుచేసుకున్నారట అన్నా రాంబాబు. అందుకు ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నాయని సమాచారం. అందుకు నిదర్శనమే పై ఫొటో అని తెలుస్తోంది. అన్నా రాంబాబు ఏ కార్యక్రమాన్నీ సరిగా జరపడటం లేదని, ఆయన ఏదైనా పిలుపును ఇచ్చినా క్యాడర్ పట్టించుకోవడం లేదని.. ఆయన తన పాత తెలుగుదేశం నేతలా వ్యవహరిస్తూ ఉండటంతో వైసీపీ క్యాడర్ ఆయనతో సతమతమవుతూ ఉందని స్థానిక నేతలు అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అధిష్టాన వర్గాలకు అందుతూ ఉందని సమాచారం. ఏతావాతా పులివెందుల తర్వాత వైసీపీకి భారీ మెజారిటీ వచ్చిన నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఇదని టాక్!