Begin typing your search above and press return to search.

హిస్ట‌రీ రిపీట్‌: వైఎస్ రైజింగ్‌.. కేసీఆర్ డౌన్ ఫాల్

By:  Tupaki Desk   |   25 May 2019 5:33 AM GMT
హిస్ట‌రీ రిపీట్‌:  వైఎస్ రైజింగ్‌.. కేసీఆర్ డౌన్ ఫాల్
X
చ‌రిత్ర‌ను జాగ్ర‌త్త‌గా చూస్తే చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు క‌నిపిస్తాయి. తాజాగా అలాంటిదే ఒక విష‌యాన్ని పలువురు ప్ర‌స్తావిస్తున్నారు. వైఎస్ రైజ్ అయిన‌ప్పుడు కేసీఆర్ డౌన్ ఫాల్ ఉంటుంద‌న్న పోలిక ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి టీఆర్ ఎస్ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌టం.. మంచి ఫ‌లితాల్ని సాధించింది. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్ష హోదాలో మంత్రి ప‌ద‌వుల్ని తీసుకుంది. ఆ త‌ర్వాత త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఉద్య‌మాన్ని నిర్వ‌హించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ ఒంట‌రిగా బ‌రిలోకి దిగి ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఆ సంద‌ర్భంగా కేసీఆర్.. టీడీపీల‌తోకూడిన మ‌హాకూట‌మి అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. 2009 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కేసీఆర్ కున్న ఛ‌రిష్మా మ‌స‌క‌బారింది. వైఎస్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో కేసీఆర్ విల‌విల‌లాడిపోయారు. వైఎస్ వ్యూహంలో ఆయ‌న చిత్తు అయ్యారు.

క‌ట్ చేస్తే.. 2014 ఎన్నిక‌ల వేళ‌లో కేసీఆర్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే వేర్వేరుగా పోటీ చేశారు. కొత్త రాష్ట్రంలో సెంటిమెంట్ పుణ్య‌మా అని కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నామ‌మాత్రంగానే సీట్ల‌ను సొంతం చేసుకుంది. అనంత‌రం కేసీఆర్ షురూ చేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో తెలంగాణ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న‌దే లేకుండా పోయింది. ఇదిలాఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్ చారిత్ర‌క ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు. నిజానికి ఈ విజ‌యానికి కేసీఆర్ కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ.. వైఎస్ ఫ్యామిలీ రాజకీయంగా రైజింగ్ లో ఉంటే.. కేసీఆర్ డౌన్ కావ‌టం జ‌రుగుతుంటుంది. తాజాగా అలాంటిదే చోటు చేసుకోవం విశేషం.

తాజా ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కు.. టీఆర్ఎస్ కు సంబంధం లేకున్నా.. రెండు వేర్వేరు రాష్ట్రాల్లోజ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్ సెంటిమెంట్ మ‌రోసారి ఫ్రూవ్ అయ్యిన‌ట్లుగా చెబుతున్నారు. ఏపీలో వైఎస్ ఫుల్ రైజింగ్ లోకి వ‌చ్చేస్తే.. తెలంగాణ‌లో అప్ప‌టివ‌ర‌కూ స్ట్రాంగ్ ఉన్న కేసీఆర్‌.. తాజా ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌ర‌వ‌టం ఊహించ‌ని విధంగా మారింది. వైఎస్ రైజ్ అయిన ప్ర‌తిసారీ కేసీఆర్ డౌన్ అవుతార‌న్న సెంటిమెంట్ కు త‌గ్గ‌ట్లే తాజా ప‌రిణామం చోటు చేసుకుంద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తోంది. త‌ర‌చి చూస్తే..నిజ‌మేన‌నిపించ‌క మాన‌దు. కాకుంటే..గతంలో వైఎస్.. కేసీఆర్ కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయ స్ప‌ర్థ ఉండేది. తాజాగా వారి మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణం ఉంది. అయిన‌ప్ప‌టికీ సెంటిమెంట్ మ‌త్రం కంటిన్యూ అవుతూ ఉండ‌టం విశేషం.