Begin typing your search above and press return to search.

ఆ ఫొటోలు పెట్టినోళ్ల‌ను చెప్పుతో కొట్టాల‌నుకున్నాః రోజా

By:  Tupaki Desk   |   14 Oct 2017 9:17 AM GMT
ఆ ఫొటోలు పెట్టినోళ్ల‌ను చెప్పుతో కొట్టాల‌నుకున్నాః రోజా
X
సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని `విశృంఖ‌ల స్థాయి`కి చేరిన‌ క్రియేటివిటీతో బాధ‌ప‌డుతున్న సెల‌బ్రిటీలు ఎందరో. సంబంధం లేని ఇమేజ్‌ల‌ను ఒక‌దానితో ఇంకోటి జ‌త‌చేసి కొంద‌రు అతిగాళ్లు చేస్తున్న ప‌నులు సెల‌బ్రిటీల‌కు కంటిమీద కునుకు లేని పరిస్థితిని సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ తీరు శృతిమించిపోయిన నేప‌థ్యంలో ఇటీవ‌లే సినీ పెద్ద‌లు పోలీసులను ఆశ్ర‌యించి...మార్ఫింగ్ మాయ‌గాళ్ల భ‌ర‌తం ప‌ట్టాల‌ని కోరారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఓ వ్య‌క్తిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఇలాగే మార్ఫింగ్ చిత్రాల వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ప‌డ్డ వైసీపీ ఎమ్మెల్యే రోజా త‌న ఆవేద‌న‌ను ఓ మీడియా సంస్థ‌కు వెళ్ల‌డించారు.

ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ రోజాతో ఇంట‌ర్వ్యూ చేసిన సంద‌ర్భంగా నంద్యాల ఉప ఎన్నిక ఓట‌మి స‌మ‌యంలో కొంద‌రు రోజాకు గుండు కొట్టించిన‌ట్లున్న ఫొటోల‌ను పోస్ట్ చేసిన సంగ‌తిని ప్ర‌స్తావిస్తూ...రోజా అభిప్రాయం కోరింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోజా తీవ్ర మ‌నోవేధ‌న‌తో స్పందించారు. ``భార‌తీయ‌ - హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం గుండు ఎప్పుడు కొడ‌తారో వీళ్ల‌కు తెలుసా? ఒక అమ్మ‌కీ - అబ్బ‌కీ పుట్టిన వాళ్ల‌యితే ఇలా చేసి ఉండ‌రు. వాళ్ల‌ను చెప్పుతో కొట్టాలి అనుకున్నాను.అబ్బ‌కు - అమ్మ‌కి పుట్టామ‌నే స్పృహ కూడా లేని వాళ్లే ఇలా చేశార‌ని త‌మాయించుకున్నాను`` అని రోజా వివ‌రించారు. ``నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో నేను పోటీ చేశానా? వాళ్లే స‌వాళ్ల‌ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి తిరిగి వాళ్లే ఇలాంటి ప‌నులు చేస్తుంటే ఎలా? టీడీపీలోని కొంద‌రు ముఖ్య‌మైన వాళ్లు ఇలా చేశార‌ని నాకు స‌మాచారం ఉంది. వాళ్ల లాగ మేం వెదవ‌ ఆలోచ‌న‌లు చేసి ఉంటే....టీడీపీ నేత‌ల భార్య‌లు - కూతుళ్లు - కోడ‌ళ్ల ఫొటోలు వేస్తే ఏంటి ప‌రిస్థితి? వెయ్యి రూపాయ‌లు ఉంటే చాలు. ఇలాంటి చిత్రాలు త‌యారు చేసిస్తారు. కానీ మాకు స‌భ్య‌త అడ్డువ‌చ్చింది`` అని రోజా అన్నారు.

``ఈ విశృంక‌ల‌త్వం రోజురోజుకు శృతిమించి పోతోంది.సంబంధం లేని చిత్రాల‌ను జ‌త‌చేసి న్యూడ్‌గా చాలా ఫొటోలు పెట్టారు. నా పిల్ల‌లు ఫోన్లో ఆడుకుంటుంటారు. అలాంటి స‌మ‌యంలో ఇలాంటివి ఎంత ఇబ్బందిక‌రంగా ఉంటాయి`` అని రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి చ‌ర్య‌ను ఎలా చూస్తున్నారు..అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తారా అని స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నించ‌గా `` స‌భ‌లో ఏం ప్రివిలేజ్ ఉంది? ఏదైనా విష‌యం ప్ర‌స్తావించాల‌ని చూస్తే....ఒకావిడ వ‌చ్చేస్తుంది. గ‌తంలో మంత్రిగా ఉన్న పీత‌ల సుజాత మీడియా పాయింట్‌ లో మీడియాకు ఇవిగో రోజా సీడీలు అంటూ చూపించారు. ఊరికి బెదిరించ‌డం ఎందుకు? అంత‌గా ఉంటే సీడీలు ఇవ్వ‌చ్చు క‌దా? `` అని రోజా ప్ర‌శ్నించారు.