Begin typing your search above and press return to search.
తెలంగాణ ఎన్నికలు..వైసీపీ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 11 Nov 2018 5:45 AM GMTతెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల ఖరారు - కూటముల రూపంలో జట్టుకట్టడం - ఎన్నికల్లో గెలుపొందడం కోసం అమలు పర్చాల్సిన చాణక్య నీతి వంటి అంశాలపై ఆయా పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఇలా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్న సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అందరి చూపు పడింది. అసెంబ్లీ రద్దయి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా...ఎన్నికలకు నెల సమయం కూడా లేని సమయంలో వైసీపీ నిర్ణయం ఏంటనే ఆసక్తి నెలకొంది. కాగా, ఈ చర్చకు చెక్ పెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం వెలువరించింది.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వైసీపీ వివరించింది. నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరి ణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని - అదే సమయంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ప్రకటనలో వైసీపీ స్పష్టం చేసింది.