Begin typing your search above and press return to search.
వైసీపీ ముందుచూపు అదిరిపోలేదా?
By: Tupaki Desk | 27 Feb 2017 6:26 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌ను ఏ క్షణాన ఎమ్మెల్సీగా ప్రకటించారో కానీ రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ వారసత్వ వ్యతిరేక రాజకీయలకు వ్యతిరేకంగా అన్నగారు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మూడో తరం వారసుడిని తెరమీదకు తెచ్చిందంటూ కొందరు మీడియాలో చలోక్తులు విసురుతున్నారు. మరికొందరు లోకేష్ ఎంట్రీ విషయంలో బాబు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సమయంలోనే నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. అనూహ్య రీతిలో ఆయనకు కేఏ పాల్ ట్వీట్ చేశారు.
తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించినందుకు పొలిట్ బ్యూరో సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి సమన్వయకర్తగా ఉన్న నారా లోకేష్ కృతజ్ణతలు తెలిపారు. తనపై నమ్మకంతో తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించిందుకు కృతజ్ణతలు తెలుపుతూ ప్రజలకు మరింత సేవ అందించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. అయితే చిత్రంగా ఈ ట్వీట్‌కు కేఏ పాల్ స్పందించారు. "ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగు.నేను నీకు ప్రచారం చేస్తాను. ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిగా గెలిపించానో...అలాగే నీ విజయం కోసం కృషిచేస్తాను. ప్రయత్నాన్ని వదిలిపెట్టకు" అంటూ హితబోధ చేశారు.
పాల్ చేసిన రీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంలో నిజం ఎంత తేల్చుకునేందుకే కొందరు కేఏ పాల్ ట్విట్టర్ అకౌంట్‌ను చూడాగా ఈ ట్వీట్ లేదు. దీంతో ఇదంతా కొందరి ఉద్దేశపూర్వక చిత్రం అంటూ తెలుగుదేశం అభిమానులు హర్ట్ అయ్యారు. మరోవైపు ఇంకొందరుమాత్రం లేదు లేదు పాల్ ట్ఈట్ చేశాడు కానీ ఆ తర్వాతే దాన్ని డెలిట్ చేశాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ...ఈ విషయం అయితే హాట్ టాపిక్ అయింది.