Begin typing your search above and press return to search.
ఏపీ ప్రభుత్వానికి హెరిటేజ్ సంస్థ వివరణ!
By: Tupaki Desk | 12 Jun 2020 11:46 AM ISTగత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమైంది జగన్ సర్కార్. ఇందులో హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేశారని, హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ఖర్చులపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తమ సంస్థ పై ఆరోపణలు రావడంతో స్పందించిన హెరిటేజ్ ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఉత్పత్తులపై హెరిటేజ్ సంస్థ వివరణ ఇచ్చింది. రూ.40కోట్ల విలువైన మజ్జిగ ప్రభుత్వానికి హెరిటేజ్ సరఫరా చేసింది అనేది పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసింది. ఏపీ ప్రభుత్వానికి 2015-16 నుంచి 2019-20 వరకు సరఫరా అయ్యే మజ్జిగ విలువ కేవలం రూ. 1.49కోట్లు మాత్రమేనని హెరిటేజ్ సంస్థ స్పష్టం చేసింది.
అలాగే , ముఖ్యమైన పండుగలకు టెండర్ల ప్రక్రియలో ఉత్పత్తులు ప్రదానం చేశామని, బ్రహ్మోత్సవం, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఇలా చాలా సందర్భాల్లో ఆర్డర్లు ఇతర కంపెనీలు, బ్రాండ్లతో కలిసి ఒకే ధరకు ఆర్డర్లు పంచుకున్నామని పేర్కొంది. మొత్తం ఆర్డర్ ఏ ఒక్క దానికి హెరిటేజ్ సంస్థ ఇవ్వలేదని తెలిపింది. ప్రతి ఏడాది అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థల ద్వారా పంపిణీ చేశామని, ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉందని హెరిటేజ్ చెబుతోంది. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థపై ఆధారపడిన రైతులకు ఉపయోగపడిందని.. హెరిటేజ్ సంస్థపై నిందలు మోపే ముందు లక్షల మంది, రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలంటోంది.
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ టెండర్ లోనే హెరిటేజ్ పాల్గొంది. 2014-15 నుంచి 2016-17 వరకు నెయ్యి సరఫరా మొత్తం ఆర్డర్ విలువ రూ 21.19 కోట్లు. ప్రతి ఏడాది అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థ ల ద్వారా పంపిణీ చేయబడింది. ప్రతి ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంది. టెండర్లలో పాల్గొనే పంపిణీ అవకాశాలు దక్కించుకున్నాం. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థ పై ఆధారపడిన రైతులకు ఉపయోగపడింది. సంస్థ పై అనవసర నిందలు మోపే ముందు లక్షల మంది రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలి.’ అని ఆ ప్రకటనలో హెరిటేజ్ సంస్థ పేర్కొంది.