Begin typing your search above and press return to search.
గోదావరి జలాల్లో సగం వాటా వైఎస్ దే
By: Tupaki Desk | 10 Sep 2015 9:49 AM GMTగోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిన పూర్తి ఘనత తనదేనని, ఇందుకు ప్రజలు పండగ చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. వాస్తవానికి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తీసుకు రావడం నిజంగా ఒక పండుగే. కానీ, అందులో పూర్తి క్రెడిట్ చంద్రబాబు నాయుడుకు మాత్రమే రాదని, సగం క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పోతుందని వివరిస్తున్నారు విశ్లేషకులు. పట్టిసీమ ను నిర్మించడం ద్వారానే గోదావరి నీళ్లు రాలేదని, పట్టిసీమ ఒక భాగం మాత్రమేనని చెబుతున్నారు.
వాస్తవానికి, పట్టిసీమ ఇంకా పూర్తి కాలేదు. పట్టిసీమ పూర్తయి, దాని నుంచి నీళ్లు వస్తే సగం క్రెడిట్ చంద్రబాబుకు దక్కి ఉండేది. కానీ ఇప్పుడు నీళ్లు వచ్చింది తాడిపూడి ఎత్తి పోతల పథకం నుంచి. తాడిపూడి ఎత్తి పోతల పథకాన్ని ఉమ్మడి ఏపీ సీఎంగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడే. కానీ ఆయన తన హాయంలో ఉద్యోగుల జీతాలకు మినహా ఒక్క పైసా కేటాయించలేదు. వైఎస్ వచ్చిన తర్వాతే తాడిపూడికి ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి దానిని పూర్తి చేయించారు. వాస్తవానికి దీని నుంచి నీళ్లు ఎప్పుడో వచ్చి ఉండేవి. కానీ, వైఎస్ తర్వాత కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం.
ఇక రెండోది పోలవరం కుడి ప్రధాన కాలువను నిర్మించింది వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. పోలవరం ప్రాజెక్టులో భాగంగా దానిని నిర్మించారు. ఆ కాల్వ కనక లేకపోతే ఇప్పుడు కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు వచ్చేవే కాదు. ఆ కాల్వ నిర్మించారు కనక.. అందులో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయించారు కనక నీళ్లు వచ్చాయి. లేకపోతే కృష్ణాకు గోదావరి నీళ్లు ఇప్పట్లో సాధ్యమయ్యేదే కాదు. తాడిపూడి, పోలవరం కుడి కాల్వలు రెండూ వైఎస్ హయాంలోనే 80 శాతం వరకు పూర్తయ్యాయి. కానీ, మిగిలిన పనులను టీడీపీ పూర్తి చేసింది. ఇక పట్టిసీమ పూర్తయితే దాని క్రెడిట్ పూర్తిగా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.