Begin typing your search above and press return to search.

వైఎస్సార్ పీఏ సూరీడు... జనసేన నుంచి పోటీనా....?

By:  Tupaki Desk   |   15 Dec 2022 2:30 PM GMT
వైఎస్సార్ పీఏ సూరీడు... జనసేన నుంచి పోటీనా....?
X
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగిన వారు అతని పీఏ సూరీడు. వైఎస్సార్ కి అన్ని విధాలుగా తోడూ నీడగా సూరీడు ఉండేవారు. కడప జిల్లాకు చెందిన సూరీడు వైఎస్సార్ బతికి ఉన్నపుడే రాజకీయంగా ఆర్ధికంగా అన్ని రకాలుగానూ సెటిల్ అయ్యారని చెబుతారు. వైఎస్సార్ తోడు నీడగా ఉండే సూరీడు మీద ఎన్ని రకాలైన ఫిర్యాదులు వచ్చినా వైఎస్సార్ పెద్దగా పట్టించు కునేవారు కాదు అని చెబుతారు.సూరీడు అని అంత నమ్మే వారు అని అంటారు .

ఇక సూరీడు వైఎస్సార్ తో పాటే అన్నట్లుగా పాతికేళ్ల పాటు ప్రయాణం చేశారు. వైఎస్సార్ మంచిలో బాధలో సూరీడు ఉన్నారు. ఒక విధంగా వైఎస్సార్ కుటుంబ సభ్యుడి గా సూరీడు మెలిగారు అని చెప్పాలి. అలాంటి సూరీడు ని వైఎస్సార్ చనిపోయాక జగన్ పక్కన పెట్టేశారు అని అంటారు . ఇంకా చెప్పాలీ అంటే పూర్తిగా తొక్కేశారు అని కూడా కొంత మంది అంటూ ఉంటారు.

జగన్ మాత్రమే కాదు వైఎస్సార్ సతీమణి విజయమ్మ కూడా సూరీడుని పెద్దగా పట్టించుకోలేదని అంటారు. మధ్య మధ్యలో కొన్ని సార్లు సూరీడుని కాపాడినా ఆయన గురించి ఆలోచించినా టోటల్ గా చూస్తే మాత్రం వైఎస్సార్ ఫ్యామిలీ సూరీడు ని సైడ్ చేసింది అనే అంటారు. ఇక సూరీడు చూస్తే వైఎస్సార్ నీడగా ఉంటూ తనకంటూ అలా ఒకే పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఆ సూరీడు మీద రాయలసీమ లో జనసేన వర్గాల్లో ఒక వార్త ప్రచారం లో ఉంది . ఆయనకు రాజకీయ ఆసక్తి ఉంది అని అంటున్నారు. కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి అయినా పోటీ చేయాలని సూరీడు చూస్తున్నాట్లుగా చెబుతున్నారు . అందుకు ఆయన జనసేన పార్టీని ఎంచు కుంటున్నట్లుగా ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక ఆర్ధికంగా చూస్తే సూరీడుకు తిరుగులేదని అంటున్నారు. హైదరాబాద్ లో ఉండే సూరీడు బాగానే సెటిల్ అయ్యారని చెబుతున్నారు.

దాంతో ఇపుడు సూరీడు రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ సూరీడు జనసేన నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే అది అతి పెద్ద సంచలనం అవుతుంది. వైఎస్సార్ ఇంటి మనిషి వెళ్లి మరీ పవన్ పార్టీతో చేతులు కలిపినట్లే అవుతుంది. ఒక విధంగా వైఎస్సార్ నీడగా ఉండే సూరీడు పెద్ద ఎత్తున ఫోకస్ అవుతారు.

ఆయన వైసీపీ మీద చేసే కామెంట్స్ కానీ పొలిటికల్ సెటైర్లు కానీ ఒక రేంజిలో ఉంటాయని అంటున్నారు.వైఎస్సార్ ఫ్యామిలీ గురించి జగన్ గురించి పూర్తిగా తెలిసిన సూరీడు రాజకీయ అరంగేట్రం చేస్తే కనుక కచ్చితంగా అది వైసీపీకి కడప జిల్లాలో అతి పెద్ద దెబ్బ అవుతుంది అని అంటున్నరు. ఇదే టైంలో జగన్ని ఆయన సొంత జిల్లా కడపలో నిలువరించాలని, అక్కడ తన దూకుడు సాగించాలని ఆశిస్తున్న జనసేనకు సూరీడు రూపంలో అతి పెద్ద రాజకీయం లాభం చేకూరుతుంది అని అంటున్నారు.

సూరీడు కనుక జనసేనలో వెలిగితే వైసీపీకి అన్ని వైపుల నుంచి ఇబ్బందులే అని అంటున్నారు. అసలు ఆయన ఏమి చెబుతారో అని కూడా ఒకటికి పదిమార్లు వైసీపీ నేతలు ఆలోచించుకుని కంగారు పడాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే సూరీడు ని జనసేనలోకి తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం మామూలుగా ఉండదనే చెప్పాలి. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్న తీరున జగన్ విషయంలో ఆయనకు సూరీడుని ఎదురుపెట్టి పవన్ సంధించే పాశుపతాస్త్రం అవుతుంది అని అంటున్నారు.

మరి సూరీడు ఎటూ వైసీపీ వారికి సన్నిహితంగా లేడు. ఆయన ఈ రోజు ఫ్రీ బర్డ్. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నా జనసేనలోకి చేరాలనుకున్నా ఎవరూ అడ్డే సీన్ అయితే లేదు. దాంతో ఇంతకాలం సూరీడుని సైడ్ చేసినందుకు వైసీపీ పెద్దలు చింతించాల్సి ఉంటుందని అంటున్నారు. సూరీడు రాజకీయ అరంగ్రేట్రం ఒక సంచలనం అయితే జనసేన నుంచి అంటే మరో సంచలనం. మరి ఈ రెండు సంచలనాలు కలసి వైసీపీ కొంపను కడప జిల్లాలో ఎలా ముంచబోతాయో అన్న చర్చ అయితే వాడిగా వేడిగా ఉంది మరి.

చూద్దాం సూరీడు రాజకీయాల్లోకి వస్తాడు అనే ప్రచారం ఎంత వరకు నిజమో అనేది . ఇవన్నీ గాలి వార్తలు అని కొట్టి పారేస్తాడో లేక నిజంగానే ఆయన రాజకీయాల్లోకి వస్తారో అనేది కాలమే చెబుతుంది .



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.