Begin typing your search above and press return to search.

ఈసారి వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. భగ్గుమన్న వైసీపీ

By:  Tupaki Desk   |   10 Jan 2021 9:50 AM GMT
ఈసారి వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. భగ్గుమన్న వైసీపీ
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఆలయాలపై దాడులు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న దుండగులు తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వదలకపోవడం సంచలనమైంది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో దారుణం జరిగింది. మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహం కుడిచేతి మణికట్టు వరకు విరిగి కిందపడిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకొని భారీ ఆందోళన చేపట్టారు. కావాలనే ఎవరో ధ్వంసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ రేపు ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించేందుకు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా ప్రభుత్వ పథకాల ప్రకటనకు ముందు ఏపీలో విగ్రహాలు ధ్వంసం చేస్తుండడం వరుసగా జరుగుతోంది.. ఈ క్రమంలోనే ఏదో అలజడి సృష్టించాలనే వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల పనియేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

స్థానిక ఎమ్మెల్యే.. జిల్లా మంత్రి అయిన గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఈ సంఘటన జరగడం కలకలం రేపింది.