Begin typing your search above and press return to search.
ఈసారి వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారే
By: Tupaki Desk | 6 Sep 2015 10:04 AM GMTగత కొద్ది రోజులుగా గోదావరి జిల్లాల్లో సినీ హీరోల ఫ్లెక్సీల్ని ధ్వంసం చేయటం.. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవటం తెలిసిందే. అభిమానుల మధ్య మొదలైన పోరాటం.. రోజురోజుకీ విస్తరించి.. భీమవరం టౌన్ లో ఫ్లెక్సీలు మొత్తాన్ని తీసేసి.. 144 సెక్షన్ విధించిని ఉద్రిక్తతలు ఒక కొలిక్కి రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా సినీ హీరోల ఫ్లెక్సీలకు పరిమితమైన ధ్వంస రచన ఇప్పుడు రాజకీయ నాయకులకు పాకింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయటం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తిమ్మన్నపాలెంలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం తాజా ఉద్రికత్తకు దారి తీసింది.
వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో అలెర్ట్ అయిన పోలీసులు.. పరిస్థితిని సమీక్షించి.. ఆందోళనల్ని అదుపు చేసే పనిలో పడ్డారు.