Begin typing your search above and press return to search.

వైఎస్సార్ టీపీ ష‌ర్మిల పార్టీ ఎవ‌రికి ``బీ టీమ్‌``

By:  Tupaki Desk   |   12 July 2021 8:51 AM GMT
వైఎస్సార్ టీపీ ష‌ర్మిల పార్టీ ఎవ‌రికి ``బీ టీమ్‌``
X
ఎన్నో ఆశ‌ల‌తో తెలంగాణ‌లో పార్టీ పెట్టిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌, సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ష‌ర్మిల పార్టికి ఇప్పుడు బోలె డు స‌మ‌స్య‌లు, ప్ర‌శ్న‌లు వెంటాడుతున్నాయి. నిజానికి తెలంగాణ వంటి ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న రాష్ట్రంలో ఒక పార్టీని స్థాపించ‌డం.. అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న‌ను వినిపించ‌డం వంటిది స‌వాలుతో కూడుకున్న‌దే. అయితే.. ఇప్ప‌టికిప్పు డు..ష‌ర్మిల పార్టీని చూసుకుంటే.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా సీనియ‌ర్ నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఒక కౌన్సిర‌ల్ స్థాయి నాయ‌కుడు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి కొత్త‌పార్టీ పెట్టారంటే.. ఆ పార్టీపై అంచ‌నాలు బోలెడు ఉంటాయి. ఇత‌ర పార్టీలు స‌హా అధికార పార్టీలో త‌ట‌స్థంగా ఉన్న నేత‌లు కొత్త పార్టీవైపు మొగ్గు చూపుతారు.

కానీ, ష‌ర్మిల పార్టీ విష‌యంలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆమె వైపు చూడ‌లేదు. గ‌తంలో వైఎస్ అభిమానులుగా ఉన్న‌వా రు.. ఒక‌రిద్దరు మాత్ర‌మే పార్టీలో చేరారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌ని నాయ‌కులు చేరారు. వీరితో క‌లిసి అధికారంలోకి ఎలా వ‌స్తుంద‌నేది ప‌క్క‌న పెడితే.. అస‌లు పార్టీకి ఒక కీల‌క విష‌యం ప్ర‌తిబంధ‌కంగా ఉంది. ప్ర‌స్తుతం పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నేత‌ల‌కు పార్టీ నేత‌ల‌తో ఫోన్లు చేయించి.. పార్టీలో చేరాల‌ని.. గుర్తింపు ఇస్తామ‌ని చెప్పిస్తున్నార‌ట‌. అయితే.. దీనికి స‌ద‌రు నేత‌ల నుంచి ఒకే ఒక సూటి ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

``అస‌లు మీ పార్టీ ఏ పార్టీకి బీ టీమో చెప్పండి. ఆ త‌ర్వాత వ‌చ్చేదీ లేందీ ఆలోచిస్తాం!`` అని స‌ద‌రు నేత‌ల నుంచి స‌మాధానం వ‌స్తోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ష‌ర్మిల పార్టీని అటు అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు బీ టీం అని కొంద‌రు భావిస్తున్నారు. మ‌రికొందరు.. బీజేపీ కి బీ టీం అని చెబుతున్నారు. దీంతో కొత్త‌గా చేరాల‌ని అనుకునే నాయ‌కులు ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే ఆలోచిస్తు న్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఏ పార్టీకి బీ టీమో.. ష‌ర్మిల చెప్పాలి. లేదా.. తాము ఎవ‌రికీ బీ టీం కాద‌ని.. ఆమె ప్ర‌జ‌ల‌ను, నాయ‌కుల‌ను కూడా న‌మ్మించాలి. ఈ రెండు విష‌యాల్లో క్లారిటీ క‌నుక లేక పోతే.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం ఉన్న తెలంగాణ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణంలో .. ష‌ర్మిల పెట్టిన పార్టీవైపు ఎవ‌రూ అడుగులు వేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా ష‌ర్మిల వైపు చూసే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. నాయ‌కులు లేకుండా తెలంగాణలో ష‌ర్మిల పార్టీ పుంజుకోవ‌డ‌మూ క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. ఉద్య‌మ నేప‌థ్యం లేక‌పోవ‌డం.. బ‌ల‌మైన పార్టీలురంగంలో ఉండ‌డం.. ష‌ర్మిల పార్టీపై అనేక సందేహాలు, అనుమానాలు ఉండ‌డం వంటివి పార్టీ పుంజుకునేందుకు ప్ర‌తిబంధ‌కంగా మారుతున్నాయ‌ని వారు విశ్లేషిస్తున్నారు. మ‌రి ష‌ర్మిల ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎప్ప‌టికి స‌మాధానం ఇస్తారో చూడాలి.