Begin typing your search above and press return to search.
వైఎస్ చెప్పిన సామెత మరోసారి చంద్రబాబుకు వర్తిస్తోంది!
By: Tupaki Desk | 19 Sep 2019 6:55 AM GMTఅమ్మకు అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట..’ అంటూ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరచూ సామెతను చెప్పేశారు. చంద్రబాబు నాయుడు జనాలకు అది చేస్తా..ఇది చేస్తా.. అంటూ కబుర్లు చెబుతూ ఉన్న సమయంలో - ఉచిత హామీలను గుప్పించిన సమయాల్లో వైఎస్ ఆ సామెతను ఉటంకించేవారు.
వైఎస్ ఇప్పుడు లేరు. అయితే ఆయన చెప్పిన సామెత మాత్రం చంద్రబాబు నాయుడుకు బాగానే సెట్ అవుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణ కోడెల శిపవ్రసాద్ రావు విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన - వ్యవహరిస్తున్న తీరే .. అని అంటున్నారు.
కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు బాసటగా నిలవలేదు. కే ట్యాక్స్ విషయంలో చంద్రబాబు నాయుడు స్పందించలేదు. కే ట్యాక్స్ వసూలు చేశారంటూ కోడెల కుటుంబీకులపై కేసులు పెట్టిన వారిలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు- కోడెలకు సొంత సామాజికవర్గం వారు కూడా కే ట్యాక్స్ బాధితులుగా పోలీస్ స్టేషన్లకు ఎక్కారు.
అలా సొంత సామాజికవర్గం వారు - టీడీపీ వాళ్లు ఫిర్యాదులు చేస్తున్నా.. అప్పుడు వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు. పైగా కోడెల వ్యతిరేక వర్గాన్ని సత్తెనపల్లిలో చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట చంద్రబాబు నాయుడు. అలాగే సత్తెనపల్లి బాధ్యతల నుంచి కోడెలను తప్పించే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉండేదల. కోడెల శివప్రసాద్ బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు - అండగా నిలబడలేదు.
ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అపారమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోడెల మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కోడెలపై నమోదు అయినవి అక్రమ కేసులని అంటున్నారు. మరి ఇవే మాటలను కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు స్పందించని చంద్రబాబు నాయుడు ఇప్పుడెందుకు ఇంతలా రియాక్ట్ అయిపోయి.. రాజకీయం చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు సామాన్యుల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడి తీరు గురించి చర్చించుకుంటూ వైఎస్ చెప్పిన సామెతను ప్రస్తావిస్తున్నారు వారు!