Begin typing your search above and press return to search.
బాబంటే..నమ్మించు..వంచించు : జగన్
By: Tupaki Desk | 27 March 2018 5:57 PM GMTమాటలతో కాలం వెళ్లబుచ్చుతున్న చంద్రబాబుకు హోదా విషయంలో గట్టి ఝలక్ ఇచ్చిన జగన్ ఈరోజు గుంటూరు పాదయాత్రలో భాగంగా దునుమాడేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాసంకల్పయాత్రలో మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబుపై చెలరేగిపోయారు. బాబు అధికారంలోకి వచ్చాక ఏరుదాటాక తెప్పతగలేశారని - ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోయారని అన్నారు.
బాబు తాను ఇరుక్కుని ఏపీని కూడా కేసీఆర్ వద్ద ఇరికించారని - కేసీఆర్ భయం ఎందుకు బాబూ.. ‘నరసరావుపేట - సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకు చంద్రబాబు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని? రైతులు అడుగుతున్నారు. వాళ్లకు సమాధానం చెప్పు' అని నిలదీశారు. కేసీఆర్ కు ఉన్న రోషం - బాబుకు లేదు.. అదే ఏపీకి పెద్ద లోటు అన్నారు. జగన్ మాట్లాడుతుంటూ జనం ఊగిపోతూ వినడం కనిపించింది.
‘చంద్రబాబుకు తెలిసింది అవినీతి - తద్వారా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యే లను-ఎంపీలను కొనడం... మనకు ఈ అనుభవమా కావాల్సింది అని జగన్ ప్రశ్నించారు. దీంతో బాబు బాగుపడతాడు గాని - ఏపీ బాగుపడదని జగన్ వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా టేపుల్లో దొరికిన చంద్రబాబు ఏపీకి తెలంగాణ నుంచి సాధించుకోవాల్సిన వాటిపై నోరు మెదపడం లేదన్నారు. ఏమైనా మాట్లాడితే టేపులను బయటకు తీసి కేసీఆర్ జైల్లో వేయిస్తాడని చంద్రబాబుకు భయం అని జగన్ అన్నారు.
దేశంలో జీఎస్టీ ఉంటే ఏపీలో టీఎస్టీ ఉందని జగన్ ఎద్దేవా చేశారు. టీఎస్టీ అంటే తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్ అన్నారు. సత్తెనపల్లిలో మరో ట్యాక్స్ కూడా ఉందని - దానిపేరు కేఎస్టీ-కోడెల సర్వీస్ ట్యాక్స్ అన్నారు. చంద్రబాబు రూపొందించిన ప్రతి పథకం అవినీతి చేయడానికి అనుకూలంగా - డబ్బులు నొక్కేయడానికి పనికొచ్చేలా రూపొందించారని - ఒక్క పథకమూ ప్రజా శ్రేయస్సు లక్ష్యంతో రూపొందించలేదన్నారు. జన్మభూమి కార్యక్రమం మొదలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థతో ముడిపడిన ఏ పని జరగాలన్నా టీఎస్టీని చెల్లించకపోతే పనులు జరగడం లేదని అన్నారు. ఇక సత్తెనపల్లి ప్రజల కష్టాలు చెప్పక్కర్లేదు... తోపుడు బండ్లు మొదలు అపార్ట్ మెంట్ల వరకూ కేఎస్ టీని అధికార జులుంతో వసూలు చేస్తున్నారు. వీటి బారి నుంచి తప్పించుకోలేక 2019 ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, బాబును ఇంటికి పంపడానికి రెడీ అయిపోయారని వ్యాఖ్యానించారు.
బాబంటే.. నమ్మించు.. వంచించు.. మాట నిలబెట్టుకోవడం చంద్రబాబు చరిత్రలోనే లేదన్నారు. ‘ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నిలబెట్టుకోలేదు. ఏ కులాన్ని- వర్గాన్ని వదలకుండా ప్రతి ఒక్కరికీ హామీఇచ్చిన చంద్రబాబు అందరినీ వరుసబెట్టి మోసగించారని అన్నారు. నాలుగేళ్ల పాలన మోసం.. అబద్దాలు.. ఇవి ఏ స్థాయిలో ఉన్నాయంటే... తొలిసారి ప్రభుత్వానికి ప్రజలు ఎదురితిరిగి తరిమేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిన బాబు మనం కాపాడుకుంటూ వచ్చిన ప్రత్యేక హోదా డిమాండ్ ను హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా వద్దన్నది బాబు-ఆయన మంత్రులు మాత్రమే.. అంత గొప్ప చరిత్ర బాబుది అని తీవ్రంగా దుమ్మెత్తిపోశారు.