Begin typing your search above and press return to search.
చంద్రబాబు లెక్క కరెక్ట్ లెక్క.. బీజేపీ ఎంపీ !
By: Tupaki Desk | 31 Jan 2020 9:23 AM GMTఏపీ స్పెషల్ స్టేటస్ ...ఈ పదాన్ని కూడా ప్రజలు దాదాపుగా మరచిపోయారు. ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలుగా చేసే సమయంలో కొత్త రాష్ట్రమైన ఏపీకి చాలా నష్టం జరుగుతుంది అని భావించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంట్ లో ప్రకటించింది. కానీ , ఆ తరువాత ఈ స్పెషల్ స్టేటస్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు , అల్లర్లు కూడా జరిగాయి. కానీ , ప్రస్తుతం ఇది బీజేపీ చెప్పినట్టుగానే ముగిసి పోయిన అధ్యాయంలానే కనిపిస్తుంది. ఒక రకంగా ఏపీ కి స్పెషల్ స్టేటస్ రాక పోవడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. అప్పట్లో ఎన్డీయే కూటమిలో కొనసాగిన నేపథ్యంలో బీజేపీ స్పెషల్ స్టేటస్ కి బదులుగా స్పెషల్ ప్యాకెజీ ఇస్తాం అని చెప్తే ...ముఖ్యమంత్రి హోదాలో అర్ధరాత్రి సమయంలో ప్రెస్ మీట్ పెట్టి ..కేంద్రం ఇచ్చే స్పెషల్ ప్యాకేజీ ని స్వాగతిస్తునాం అని చెప్పారు. అసలు స్పెషల్ స్టేటస్ ఏమైనా రాష్ట్రానికి సంజీవినా అంటూ స్టేటస్ కావాలన్నా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కానీ , ఆ తరువాత స్పెషల్ స్టేటస్ కావాలంటూ రాష్ట్ర ప్రజలు రోడ్ల పైకి రావడం తో బాబు యూ టర్న్ తీసుకోని కేంద్రం పై పోరాడానికి సిద్ధం అంటూ ప్రకటించారు. ఆ తరువాత ఈ స్పెషల్ స్టేటస్ విషయం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికి తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఒక ప్రముఖ ఛానెల్ ప్రోగ్రాం లో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ..మరోసారి స్పెషల్ స్టేటస్ పై బీజేపీ వైఖరి ఏంటో తేటతెల్లం చేసారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఏమైనా చర్చిస్తారా అని యాంకర్ అడగ్గా .. జీవీఎల్ మాట్లాడుతూ ..ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం అని , ఆ రోజు సీఎం గా ఉన్న చంద్రబాబు కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తే ఏం వస్తుంది. మహా అయితే 4500 కోట్లు వస్తాయి అంతే ..కానీ , స్పెషల్ ప్యాకేజీ లో అంత కన్నా ఎక్కువ మొత్తం వస్తుంది అని చెప్పారు అని , అది నూటికి నూరుపాళ్లు నిజం అని, బాబు మాటను బీజేపీ ఎంపీ గుర్తుచేశాడు. కానీ , రాష్ట్ర ప్రజానీకం మాత్రం బీజేపీ పై నిప్పులు కక్కుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా , స్పెసిల ప్యాకేజీ ఇవ్వకుండా, పోలవరం కట్టకుండా , రాయలసీమకు , ఉత్తరాంధ్ర కు స్పెషల్ ఫండ్స్ ఇవ్వకుండా కేవలం చర్చలు , సమావేశలతోనే కాలం గడుపుతున్నారని, అలాగే కేవలం మాటలు చెప్తూ ప్రజలని మభ్య పెడుతున్నారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.