Begin typing your search above and press return to search.
బాబు అవుట్ డేటెడ్ : టీడీపీ అనుకూలమీడియాకు పెద్ద డౌట్...?
By: Tupaki Desk | 18 July 2022 8:31 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అంతా అపర చాణక్యుడు అని పొగుడుతారు. ఆయనకు వర్తమాన రాజకీయాల్లో సరిసాటి మరొకరు లేరు అని కూడా చెబుతూ వచ్చారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఆయన రాజకీయ ఎత్తుగడలు చూశాక చంద్రబాబుని పోల్చి చూస్తున్నారు. వైసీపీ వారు అయితే చంద్రబాబుది ఏముంది అంతా కాలం కలసి వచ్చిన రాజకీయం తప్ప అని ఎద్దేవా చేస్తారు.
కానీ అదే టీడీపీ వారు అయితే మద్దతుగా మాట్లాడుతారు, మా బాబు ఒక వ్యూహం రచించారు అంటే ప్రత్యర్ధులు ఆట కట్టు, వారు చిత్తు అని కూడా గట్టిగా జబ్బలు చరుస్తారు. కానీ గత కొంతకాలంగా చంద్రబాబు వ్యూహాలు ఏవీ పారడంలేదని అంతా అంటారు. 2018లో బీజేపీ నుంచి టీడీపీ విడిపోయి బయటకు రావడం పూర్తిగా రాంగ్ డెసిషన్ అని అంతా అంటారు. ఈ రోజుకీ తెలుగుదేశం పార్టీని ఫుల్ సపోర్ట్ చేసే మీడియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంటోంది.
నాడు కనుక మోడీతో జోడీ వీడకపోతే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోయేవారు కాదని కూడా వాదించేవారూ ఉన్నారు. ఇక బీజేపీతో జట్టు తెంచుకుని వచ్చేక చంద్రబాబు మళ్లీ ఆ వైపునకు చూడడం కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వారికి అంతగా ఇష్టంలేదని చెబుతారు. 2019తో పోలిస్తే మోడీ గ్రాఫ్ దేశంలో బాగా పడిపోయింది అని అంటారు. అలాంటపుడు తెలంగాణాలో కేసీయార్ మాదిరిగా బీజేపీకి యాంటీగా ఏపీలో జెండా ఎగరేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని కూడా విశ్లేషించేవారు ఉన్నారు.
ఇలా లేటెస్ట్ గా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మునకు టీడీపీ చివరి నిముషంలో మద్దతు ప్రకటించడాన్ని తప్పు పట్టే వారు ఉన్నారు. బాబు ఈ పని ఎందుకు చేశారు అని నాలిక కరచుకునే వారూ ఉన్నారు. ఏది ఏమైనా బాబు వ్యూహాలు సొంత వారి చేత మద్దతు ఇచ్చే వారి చేత కూడా విమర్శల పాలు అవుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఓపెన్ విత్ ఆర్కే అన్న కార్యక్రమంలో ఈ వీకెండ్ కి తెలుగు మహిళా అధ్యక్షురాలి వంగలపూడి అనిత గెస్ట్ గా వచ్చారు. ఆమెను అనేక ప్రశ్నలను ఆర్కే అడుగుతూ టీడీపీ 2019 ఎన్నిల్లో ఓడిపోవడానికి పార్టీ తప్పిదాలే చాలా ఉన్నాయని ఎత్తిచూపారు. కనీసం ఎలక్షనీరింగ్ కూడా వీక్ గా చేసుకున్నారని ఎత్తిపొడిచారు. ఈసారి అయినా జాగ్రత్త పడుతున్నారా అని ఆర్కే ఆమెని అడిగారు.
నాయకుల డేటా అంతా చంద్రబాబు దగ్గరపెట్టుకున్నారని, ప్రతీ రోజూ దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారని అనిత జవాబు చెప్పారు. అయితే దీని మీద ఆర్కే పెదవి విరవవడం ఇక్కడ గమనార్హం. డేటాలు లాప్ టాప్స్, కంప్యూటర్స్ ఫీడింగ్ అంతా ఓల్డ్ ట్రెండ్ అన్నట్లుగా ఆయన మాట్లాడారు. జగన్ దగ్గర ఏ డేటా ఉంది అంటూ ఆయన ఎదురు ప్రశ్నించడం కూడా విశేషం. జగన్ తమ బ్రెయిన్ వాడుతారు, ఆయన దగ్గర ఉన్న చిప్ తోనే కధ మొత్తం నడిపిస్తారు, తాను నమ్ముకున నలుగురైదుగురు నాయకుల ద్వారానే ఆయన మొత్తం రాజకీయం చేస్తారని ఆర్కే జగన్ గురించి చెప్పిన తీరు ఆసక్తికరంగానే ఉంది.
గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ముఖ్యం. డేటాలు ముందేసుకుని దాన్ని వడపోసి ఆ మీదట పార్టీని నడిపించడం కంటే జనాలతో నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలని ఆర్కే సూచించడం విశేషం. మొత్తానికి ఆర్కే ఇదే ఇంటర్వ్యూలో చాలా సార్లు జగన్ ప్రస్థావన తెస్తూ ఆయన మార్క్ పాలిటిక్స్ ని ఇష్టం లేకపోయినా ఇప్పటికి ఇది అవసరం అన్నట్లుగా మాట్లాడడమూ గమనార్హం.
ఇక మరో సందర్భంగా జగన్ విపక్షంలో ఉన్నపుడు పాదయాత్ర సందర్భంగా అనర్గళంగా మాట్లాడేవారని గుర్తు చేశారు. ఆనాడు ఆయన పేపర్ చూడకుండా ధాటీగా మాట్లాడేవారని కూడా ఒకింత పొగుడుతున్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇక న్యూ ట్రెండ్స్ రాజకీయాల్లోకి వచ్చాయని, వైసీపీ అయిన మరొకరు తెచ్చినా వీటిని అడాప్ట్స్ చేసుకుని ముందుకు సాగాలని ఆయన టీడీపీకి ఇండైరెక్ట్ గా బోధించడమే ఇక్కడ అసలైన మ్యాటర్.
ఏది ఏమైనా చంద్రబాబు అంతా బాగుంది అనుకుంటూ డేటాను ముందేసుకుని కూర్చుంటే పని కాదని ఆర్కే తేల్చేశారు అనే అంటున్నారు. మరి బాబు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ తో జగన్ ముందు తేలిపోతున్నారా. ఆ రకమైన అభిప్రాయానికి టీడీపీకి గట్టి మద్దతుగా నిలిచే మీడియా వస్తోందా అంటే ఒకసారి ఆలోచించి లోపాలను సమీక్షించుకోవాలి.