Begin typing your search above and press return to search.
3 రాజధానులకు మద్దతుగా వైసీపీ యాక్షన్ ప్లాన్!
By: Tupaki Desk | 4 Feb 2020 2:30 PM GMT2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏపీ రాజధాని అమరావతి పేరుతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నవ్యాంధ్ర ప్రజలకు అరచేతిలో అమరావతి గ్రాఫిక్స్ చూపించిన బాబు....ఐదేళ్లో అరకొర తాత్కాలిక భవనాలకు మాత్రమే వాస్తవ రూపం ఇవ్వగలిగారు. అయితే, బాబు చూపించిన గ్రాఫిక్స్‌తో అమరావతే ఏపీ రాజధాని అన్న సెంటిమెంట్ కొందరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బాబు గ్రాఫిక్స్, ఎల్లో మీడియా ప్రచారం...వెరసి తాజాగా అమరావతి రైతులు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అయితే, అధికార వికేంద్రీకరణతోనే ఏపీ సంపూర్ణాభివృద్ధి సాధ్యమని జీఎస్ రావు కమిటీతో పాటు వైసీపీ ప్రభుత్వం, పలు కమిటీలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా విష ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టడానికి వైసీపీ ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మూడు రాజధానుల ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలను చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఈ ప్రకారం తన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది. మూడు రాజధానులను ఏర్పాటుకు గల కారణాలు, ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏపీలో పలు చోట్ల చర్చాగోష్ఠిలు, సదస్సులు, సమావేశాలను నిర్వహించనుంది. వారం రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను వైసీపీ చేపట్టబోతోంది. ఈ కార్యక్రమాల షెడ్యూల్‌ను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారికంగా వెల్లడించారు.
కార్యక్రమాల షెడ్యూల్
ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మానవహారం కార్యక్రమాలు
ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన
ఫిబ్రవరి 8వ తేదీన చంద్రబాబుకు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దేవాలయాల్లో పూజలు
ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు
ఫిబ్రవరి 12వ తేదీన వంటా వార్పు కార్యక్రమాలు
ఫిబ్రవరి 13వ తేదీన రిలే నిరాహార దీక్షలు
ఫిబ్రవరి 14వ తేదీన గులాబీ పూలు, మూడు రాజధానుల ఆవశ్యకతను తెలిపే కరపత్రాల పంపిణీ
ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత