Begin typing your search above and press return to search.

వాగులో కొట్టుకుపోయిన కారు..వైసీపీ నేత దుర్మరణం!

By:  Tupaki Desk   |   27 Nov 2020 2:00 PM GMT
వాగులో కొట్టుకుపోయిన కారు..వైసీపీ నేత దుర్మరణం!
X
ఏపీలో నివర్ తుఫాన్ విధ్వంసం కొనసాగుతుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తుఫాన్ తీవ్రత భారీగా ఉంది. గత రెండు రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పడుతున్న ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు దాటేందుకు ప్రయత్నించి కొంతమంది గల్లంతయ్యారు. ఐరాల మండలంలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. పూతలపట్టు మండలం పాలకూరు గ్రామానికి చెందిన వినయ్‌ రెడ్డి గురువారం రాత్రి కాణిపాకం నుంచి ఐరాలకు కారులో వెళ్తున్న సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా ఆయన చనిపోయారు. కారులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. వైసీపీ నేత వినయ్‌ రెడ్డి చనిపోయారు. మరి కొద్దిసేపట్లో మృతదేహాన్ని చిత్తూరుకు తరలించనున్నారు.

అలాగే , రేణిగుంట మండలం రాళ్లవాగులో గురువారం కొట్టుకుపోయిన రైతు ప్రసాద్‌ మృతదేహాన్ని సిబ్బంది శుక్రవారం వెలికితీశారు. తంబళ్ల పల్లి నియోజకవర్గం పరిధిలోని పెద్దమండ్యం వద్ద చెరువు మొరవలో మినీ వ్యాన్ కొట్టుకుపోయింది. పుంగనూరు-తిరుపతి మార్గంలో గార్గేయ నది వంతెన కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు కుప్పకూలాయి. వర్షాలు, వరద నీటితో కొన్ని గ్రామాలు నీట మునిగాయి.