Begin typing your search above and press return to search.

ఏపీలో స్వచ్చంధ బంద్!

By:  Tupaki Desk   |   24 July 2018 5:37 AM GMT
ఏపీలో స్వచ్చంధ బంద్!
X
రవాణ స్తభించిపోయింది - పాఠశాలలు తెరుచుకోలేదు - కళాశాలలకు విద్యార్దులు హాజారుకాలేదు , సోమవారం రాత్రి మూసివేసిన దుకాణాలు తెరుచుకోలేదు. ఆర్టీసి డిపోల నుంచి బస్సులను బయటకు తీసేందుకు డ్రైవర్లే లేరు. ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో ఇళ్లలోనే ఉండిపోయారు..ఇలా ఆంధ్రప్రదేశ్‌ లో ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్‌ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. అధికార తెలుగుదేశం పార్టీ - కాంగ్రెస్ పార్టీ సహాయనిరాకరణ చేసినా బంద్‌ లో ప్రజలు స్వచ్చందంగా పాల్గోన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ ఆర్ సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన బంద్ ప్రభావం మాత్రం తగ్గలేదు. లోక్‌ సభలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తర్వాత దీనికి నిరసనగా మంగళవారం నాడు బంద్ పాటించాలని వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహాన రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగాలకైన సిద్దమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ బంద్‌ లో మాత్రం పాల్గోనకపోవడం పై ఆంధ్ర ప్రజలలో అనుమానాలు రేకేత్తిస్తోంది. తెలుగుదేశం పార్టీ బిజేపితో తెగదెంపులు చేసుకున్నామని పైకి ప్రకటించినా లోపాయికారిగా ఆ రెండు పార్టీల మధ్య స్నేహం పదిలంగానే ఉందని ప్రజలు భావిస్తున్నారు.

దీంతో అసహనానికి గురైన ఆంధ్రులు నేటి బంద్‌లో స్వచ్చందంగా పాల్గోంటున్నారు. తెలగుదేశం ప్రభుత్వం నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ హడావుడి ఎందుకు చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల చేత రాజీనామాలు చేయించడం, బిజేపి ప్రభుత్వం పై నేరుగా యుద్దం ప్రకటించడంతో ఆ పార్టీ పై ప్రజలు సానుభూతి - నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాను తీసుకుని వచ్చేది ఆ పార్టీయే అని విశ్వసిస్తున్నారు. అందుకే బంద్ లో స్వచ్చందంగా పాల్గోంటున్నారు.