Begin typing your search above and press return to search.
మరో ఎల్లో ఛానల్ పై వైఎస్సార్సీపీ నిషేధం!
By: Tupaki Desk | 8 March 2019 9:34 AM GMTతెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా పేర్గాంచిన టీవీ చానళ్ల పై స్వ నిషేధాన్ని ప్రకటిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిషేధం విధించింది. ఆ చానల్ తమ ప్రెస్ మీట్లకు రానవసరం లేదని, తెలుగుదేశం అనుకూల వార్తలను ఇచ్చే ఆ ఛానల్ చర్చాకార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ పాల్గొనరు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో చానల్ విషయంలో కూడా వైఎస్సార్సీపీ ఇదే వైఖరిని ప్రకటించింది. ఈ సారి వంతు టీవీ ఫైవ్ ది. ఆ చానల్ తమ పార్టీ కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన అవసరం లేదని జగన్ పార్టీ ప్రకటించింది. ఆ చానల్ ను తమ కార్యక్రమాల విషయంలో నిషేధిస్తున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.
టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5ను తాము బహిష్కరిస్తున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరూ ఆ చానల్ చర్చా వేదికలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టుగా తెలిసింది. తమ పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించరాదని కూడా ఆ చానల్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. పార్టీ ప్రెస్ మీట్లకు - కార్యక్రమాలకు టీవీ ఫైవ్ ను నిషేధిస్తున్నట్టుగా ప్రకటించింది.
స్వతంత్ర మీడియా ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.