Begin typing your search above and press return to search.

ముందు బిల్స్ క్లియర్ చేయండి సీఎం గారు...మేము తిరుగుతాము!

By:  Tupaki Desk   |   19 Dec 2022 1:30 PM GMT
ముందు బిల్స్ క్లియర్ చేయండి సీఎం గారు...మేము తిరుగుతాము!
X
పనులు చేసినా బిల్లులు లేవు. రావు. ఎంతకన్న తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకుని ఆ భారాలు మోయాలి. ఇదీ వైసీపీలో రగులుతున్న అసంతృప్తి. పార్టీ అధికారంలో ఉంది అన్న సంతోషం లేదు. మూడున్నరేళ్ళుగా చేతి చమురు కరిగిపోతోంది తప్ప ఏమీ మేలు జరగడంలేదు. అంతే కాదు పార్టీ కోసం పదేళ్ల పాటు పనిచేసి వచ్చిన వారికి కూడా అధికారంలోకి వైసీపీ వచ్చాక జరిగిన నిక్షార్సైన ప్రయోజనం కూడా లేదు అని అంటున్నారు.

ఇపుడు వైసీపీ క్యాడర్ లో ఇదేరకంగా రకమైన చర్చ ఇపుడు వాడిగా వేడిగా సాగుతోందిట. సచివాలయాల పనులు చేశాం అయినా బిల్లులు లేవు, డ్రైనేజ్ పనులు చేశారు అయినా కాసులు రాలలేదు, ఇక నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల కాంపౌండ్ వాల్స్ ని నిర్మించాం, అయినా పైసా రాలలేదు, ఇక రోడ్స్ వేశాం బిల్స్ రాలేదు అని వైసీపీ క్యాడర్ ఆవేదన చెందుతోంది.

ఏపీలో చూస్తే అధికార వైసీపీ క్యాడర్ బాగా నీరసపడి ఉంది. బాగా డీలా అయిపోయింది. 2019 ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం కానీ నాటి సంబరం కానీ నేడు మచ్చుకైనా వారిలో లేవు. జగన్ సీఎం కావాలి అని నాడు అంతా కష్టించి పనిచేశారు. అంతా కోరుకుంటున్నట్లుగానే జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన క్యాడర్ కి ప్రాధాన్యత ఇవ్వడంలేదని వారంతా ఇపుడు తాపీగా రచ్చబండ వద్ద చేరి వాపోతున్నారు.

జగన్ కోసం తాము ప్రభుత్వ పనులను భుజాలకెత్తుకున్నామని, ఎవరూ కాంట్రాక్టు పనులకు ముందుకు రాకపోతే వైసీపీ క్యాడర్ గా నాయకులుగా తాము నిలిచి వాటిని చేసి చూపించామని అంటున్నారు. చివరికి తమకు కూడా బిల్లులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తే ఎలా అని బాధపడుతున్నారు. తమ జేబులోని డబ్బులు తెచ్చి ఖర్చు చేశామని నిండా అప్పుల్లో మునిగామని, ఇక తమకు ఇపుడు దిక్కేది అని వారు కలత చెందుతున్నారు

వచ్చే ఎన్నికల్లో మరోమారు వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నారని, తమను జనంలో తిరగమంటున్నారని ఇదంతా బాగానే ఉంది కానీ తాము ఎలా తిరగగలమని వారు ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర తడి ఆరిపోయిందని, తమ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని, ప్రభుత్వానికి చేసిన పనుల వల్ల రావాల్సిన బిల్లులు రాకుండా ఆపేశారని వారు అంటున్నారు. మరి వాటిని ఎలా ఓర్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.

తాము ముందు సరిగ్గా ఉండి నిలబడితే కదా ప్రభుత్వ పాలన బాగుందని చెప్పి జనాల్లోకి వెళ్ళగలమని అంటున్నారు. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు అసలు చూడమని చెబుతూ ఊరూరా డబ్బులు పంచారు కదా పధకాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేశామని చెప్పుకుంటున్నారు కదా మరి బడా నాయకులే జనంలో తిరిగితే సరిపోదా అని కూడా వైసీపీ క్యాడర్ సలహా ఇస్తున్నారు. తాము ఎన్నికల వేళకు అవసరం పడ్డామా అని ఆగ్రహిస్తున్నారు.

ఇవన్నీ చూస్తూంటే వైసీపీ అధినాయకత్వం మీద క్యాడర్ ఎంత మంటెత్తి ఉందో అర్ధమవుతోంది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం ఇన్నాళ్ళూ తమను పట్టించుకోకపోవడం ఇపుడు తమ కోసం రావడం, తమ అవసరాలు ఉండడంతో తమ బిల్స్ గురించి ముందు తేల్చమని క్యాడర్ స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా ఎలా చూసుకున్నా 2019 నాటి వైసీపీ క్యాడర్ ఇపుడు కాదని ఆ కసి ఆ కోపం ఇపుడు రివర్స్ అయి తమ మీదనే వస్తున్నాయని వైసీపీ పెద్దలు గుర్తించేసరికి పుణ్యకాలం ముగుస్తుందేమో చూడాలని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.