Begin typing your search above and press return to search.
జెండా పట్టుకుంటే పదవి రాదని డిసైడ్ అయిన..!
By: Tupaki Desk | 24 Aug 2020 7:30 AM GMT‘ఊళ్లో పార్టీ జెండా పట్టనోడు పదవుల్లో ఉన్నాడు. ఊళ్లో జెండా పట్టి పార్టీని బతికించిన వాడు ఊళ్లో అరుగు మీదే ఇంకా అలానే ఉన్నాడు..’ ఇప్పుడీ మెసేజ్ వైసీపీ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. వైసీపీ కోసం పదేళ్లుగా ప్రతిపక్షంలో పోరాడిన కార్యకర్తలు, నేతల ఆవేదనకు అద్దం పడుతోంది.
ఎన్నికల ముందు టీడీపీ జెండా.. ఇప్పుడు వైసీపీ జెండా.. ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్లకే పనులు.. వాటర్ ట్యాంకర్స్ వాళ్లకే.. రోడ్డు కాంట్రాక్టు పనులు వాళ్లకే.. సచివాలయంలో పనులు వాళ్లకే.. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పనులు వాళ్లకేన్న ఆవేదన వైసీపీని నమ్ముకున్న వారిలో నెలకొంది.
ప్రభుత్వం నుంచి ఏమీ పనులు వచ్చినా అంతా టీడీపీ వాళ్లకే పోతున్నాయన్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మేము మాత్రం 10 ఏళ్లుగా జెండా పట్టుకున్నామని.. ఈరోజు మా ఎమ్మెల్యేలు మా గోషి ఊడదీసి కేసులు పెడుతున్నారని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. పార్టీని నమ్మకుంటే వచ్చేది పోలీస్ కేసులేనని.. ఎమ్మెల్యేలను నమ్ముకుంటే కాంట్రాక్టులు, ఆఫీసుల్లో పలుకుబడి దక్కుతోందంటున్నారు.
టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల దగ్గర పక్కన కూర్చీలో కూర్చొనే వైసీపీ నాయకులను ఎగతాళి చేసే పరిస్థితి ఉందని.. ఇక ఎమ్మెల్యేల దగ్గరికి పోతే అవమానమే ఎదురవుతోందని రియల్ వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. అందుకే ఎటూ కాకుండా గ్రామాల్లోని అరుగులకే పరిమితమై టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్లను చూసి వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారట.. వైసీపీ శ్రేణుల అరుగుల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పనులు కాక.. ఫలితం లేక బాధపడుతున్నారనే ఆవేదనను కళ్లకు కడుతున్నాయట..