Begin typing your search above and press return to search.
వైసీపీ సర్కారుకు ఎందుకింత దూకుడు? రాత్రికి రాత్రి.. పేరు మార్పా?!
By: Tupaki Desk | 21 Sep 2022 7:30 AM GMTకొన్నాళ్ల కిందట.. వరకు ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు వినిపించేవి. అర్ధరాత్రి పూట జీవో లు ఇస్తున్నారని.. తెల్లవారు జామున జీవోలు ఇస్తున్నారని.. కామెంట్లు వినిపించేవి. అయితే.. ఇప్పుడు.. అది కాస్తా.. మరింత ముదిరింది. ప్రజాప్రతినిధులతో చర్చలు.. బిల్లుల కు సంబంధించిన తీర్మానాలు వంటివాటిని కూడా.. అర్ధరాత్రి పూట నిర్వహిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుండడం గమనార్హం.
తాజాగా ఏపీలోని కీలకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. తీవ్ర వివాదానికి.. దారితీసింది. అయితే... ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో ఆమోదించిన కేబినెట్ వ్యవహారం తెలుసుకుని మేధావులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది.
అయితే.. వాస్తవానికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందని ప్రకటించిన జగన్.. ఆయన పేరుతో జిల్లా పెట్టామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు వర్సిటీలో పేరు మాయం చేస్తూ నిర్ణయం తీసుకున్నారని.. ఇది ఎంత వరకుసమంజసమని.. మేధావులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. వైద్య వర్సిటీతో ఎన్టీఆర్‌కు బలమైన బంధం ఉందని గుర్తు చేస్తున్నారు. వర్సిటీ ఏర్పాటు నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు ఆయన కృషి ఉందని చెబుతున్నారు.
ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. సీఎంలు మారినా 24 ఏళ్లుగా అదే కీర్తి కొనసాగుతోంది. వైఎస్కు ఏ సంబంధమూ లేకున్నా ఆయన పేరు పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్ అని అంటున్నారు. ఇప్పుడు ఆయన పేరుకే వైసీపీ సర్కారు మంగళం పాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టేందుకు రాత్రికి రాత్రే చకచకా ఏర్పాట్లు చేయడం.. ఎందుకని.. పేరు మార్చే ధైర్యం.. చీకట్లో తప్ప.. పగలు పూట చేయలేరా? అని కొందరు నిలదీస్తున్నారు.
జగన్ సర్.. వైఎస్ ఏం చేశారో తెలుసా?
రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు.
వైఎస్ హయాంలో అన్నగారు ఎన్టీఆర్‌కు మరింత కీర్తిని ఆపాదిస్తూ.. 'డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం'గా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.