Begin typing your search above and press return to search.

కడప గడపపై జగన్ క్లీన్ స్వీప్ ధీమా?

By:  Tupaki Desk   |   10 May 2019 4:36 AM GMT
కడప గడపపై జగన్ క్లీన్ స్వీప్ ధీమా?
X
2014 ఎన్నికలు.. టీడీపీ అధికారంలోకి వచ్చిదంటే గోదావరి జిల్లాలే కారణం.. పశ్చిమగోదావరి జిల్లా మొత్తం టీడీపీ గెలిచేసింది. 15 సీట్లు టీడీపీ గెలుపులో కీలకంగా మారాయి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఈ రెండు గోదావరి జిల్లాలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబుకు గోదావరి జిల్లాలే పోయిన సారి అధికారానికి అండగా నిలిచాయి. ఈసారి 2019 ఎన్నికల్లో జగన్ కు ఆయన హోంగ్రౌండ్ అయిన కడప జిల్లా పట్టం కట్టబోతుందన్న అంచనాకు వైసీపీ వర్గాలు వచ్చాయి. పోలింగ్ సరళి ఫ్యాన్ కే అనుకూలంగా ఉందని.... వైసీపీ నేతల పోల్ మేనేజ్ మెంట్ ఫలితం కనిపించిందని నేతలు ధీమాగా ఉన్నారు.

2004 వరకు కడప జిల్లాలో టీడీపీ ఆధిపత్యమే ఉండేది. వైఎస్ - మైసూరా - డీఎల్ వంటి బలమైన నేతలున్నా కూడా అప్పట్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. కానీ ఆ తర్వాత టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది. 2004లో కడపలో టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 2009లో ఒకే ఒక్కస్థానం.. 2014లోనూ ఒకే స్థానానికి టీడీపీ చాపచుట్టేసింది. రాజంపేట ఒక్కటే గెలిచి పరువు దక్కించుకుంది టీడీపీ. 2004 తర్వాత టీడీపీకి కోలుకునే అవకాశం ఇవ్వలేదు ప్రత్యర్థి పార్టీలు.

ఇక 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి సహా చాలా మందిని లాగేసి టీడీపీ బలపడింది. కనీసం ఐదారు సీట్లు కమలాపురం - రైల్వే కోడూరు - మైదకూరు - జమ్మలమడుగు - రాయచోటీ టీడీపీకి విజయావకాశాలున్నాయని ఆ పార్టీ భావించింది. కానీ పోలింగ్ సరళి పరిశీలించాక మాత్రం వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. టీడీపీ పోల్ మేనేజ్ మెంట్ వైఫల్యం.. వైసీపీ మేనిఫెస్టో - జగన్ వేవ్ పనిచేసిందని.. టీడీపీ విజయావకాశాలను ఇవే దెబ్బతీశాయని ప్రచారం జరుగుతోంది. జగన్ సొంత జిల్లా కావడంతో పకడ్బందీగా వైసీపీ నేతలు ముందుకెళ్లారు. దీంతో ఈసారి కడప జిల్లాలో వైసీపీ క్లీన్ చేస్తామన్న అంచనాకు వచ్చేశారట.. చూడాలి మరి మే 23న ఎలాంటి ఫలితం వస్తుందో..