Begin typing your search above and press return to search.

నేత‌ల కుమ్ములాటలు.. ర‌గులుతున్న వైసీపీ నియోజ‌క‌వ‌ర్గాలు!

By:  Tupaki Desk   |   12 Dec 2022 2:30 AM GMT
నేత‌ల కుమ్ములాటలు.. ర‌గులుతున్న వైసీపీ నియోజ‌క‌వ‌ర్గాలు!
X
ఏపీ అధికార పార్టీకి 151 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో సీఎం జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను ప‌క్క‌న పెడితే.. కొత్త‌గా 85 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త‌వారే విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 45 నుంచి 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. కేవ‌లం వెయ్యి, రెండు వేల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక‌, సంప్ర‌దాయ బ‌ద్ధంగా టీడీపీకి ఓటేసే నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ఒక్క ఛాన్స్ కోసం.. వైసీపీకి క‌ట్ట‌బెట్టిన నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి వాటిని మ‌ళ్లీ నిల‌బెట్టుకోవాలంటే.. మెజారిటీని పుంజుకుని మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఖ‌చ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో 85 మంది అంద‌రినీ క‌లుపుకొని వెళ్లాల్సిందే.

ప్ర‌భుత్వం ప‌థ‌కాలు ఇస్తోందిక‌దా.. సీఎం జ‌గన్‌ఫొటో ఉంది క‌దా.. అనుకుంటే అయ్యే ప‌నికాద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తున్న వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా మంది సొంత నేత‌ల‌తోనే విభేదిస్తున్నారు.

ఎవ‌రికివారు.. ఆధిప‌త్య రాజ‌కీయాలు చేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట ఎమ్మెల్యేల‌తో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా.. సీఎం జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించినా.. త‌ర్వాత‌.... వైసీపీ ఇంచార్జ్‌లతో మీటింగులు పెట్టినా.. జ‌గ‌న్ చెప్పింది కూడా ఇదే. ''మ‌న‌ల్ని.. టీడీపీ ఓడించ‌డం సాధ్యం కాదు. మ‌నం ఓడామంటే.. అది ఖ‌చ్చితంగా మ‌న‌లో మ‌న‌కున్న కుమ్ములాట‌ల వ‌ల్లే!'' అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాల‌ని చెప్పారు. పార్టీ అంద‌రిదీ అని తేల్చి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం నుంచి అనంత‌పురం వ‌ర‌కు నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు.

మంత్రి సీదిరికి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికి స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అనంత‌పురంలో ఉర‌వ‌కొండ మాజీ ఎమ్మెల్యేపై సొంత సోద‌రుడు ఎగ‌స్పార్టీ జెండా ఎగ‌రేశారు. ఇలా.. దాదాపు 80 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు సొంత నేత‌ల మ‌ధ్యే క‌నిపిస్తున్నాయి. మ‌రి దీనిని ఎలా ఎదుర్కొంటారోచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.