Begin typing your search above and press return to search.
టీడీపీ కంచుకోటను వైసీపీ కదిలిస్తుందా..?
By: Tupaki Desk | 2 March 2019 5:16 AM GMTసాగరతీరాన సహజవనరులతో ఉన్న విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.. ఓ వైపు ఏజెన్సీ ఏరియా - మరోవైపు వైవిధ్యభరితమైన ప్రాంతాలున్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ హవా సాగింది. 15 అసెంబ్లీ స్థానాలు - 3 లోక్ సభ స్థానాలు కలిగిన మన్యం జిల్లాలో ఓటర్ల తీర్పు ఎప్పడూ విలక్షణంగానే ఉంటుంది. సామాజిక కూర్పుతో ఉన్న ఈ ప్రాంతంపై త్వరలో ఎన్నికలు రానున్నందున పార్టీలన్నీ దీనిపై దృష్టి సారించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అతిపెద్ద నగరంగా రూపుదిద్దుకున్న గ్రేటర్ విశాఖలో పట్టు కోసం పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. జిల్లాపై ఆధిపత్యం కోసం పార్టీ అధినేతలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీ టీడీపీ నుంచి వలసలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో గెలుపే లక్ష్యంగా టీడీపీ సీనియర్ నేతలను వైసీపీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ వైసీపీకి మారారు. దీంతో ఆయనకు భీమిలి కోఆర్డినేటర్ గా నియమించి బరిలోకి దించుతోంది. మంత్రి గంటా శ్రీనివాస్ కు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆవంతి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
అటు టీడీపీలో టిక్కెట్ల కేటాయింపు ప్రారంభమైంది. దాదాపు సిట్టింగులకే సీటు అంటున్న పార్టీ అధినేత.. పార్టీని పట్టించుకోనివారు - అక్రమాలకు పాల్పడివారిని పక్కనబెట్టేలా నిర్ణయించారు. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ అరకు నుంచి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి కొణతాల కూడా టీడీపీలో చేరాలని భావిస్తున్నారు. మాజీ ఎంపి సబ్బం హరి సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అవంతి పార్టీని వీడిన తరువాత భీమిలిలో క్యాడర్ ను కాపాడుకునేందుకు టీడీపీ చర్యలు చేపట్టింది.
జగన్ పాదయాత్ర తరువాత విశాఖ జిల్లాలో వైసీపీకి ఆదరణ లభిస్తోంది. జిల్లాలో పార్టీకి క్యాడర్ ఎక్కువగా ఉన్నప్పటికీ బలమైన నాయకులను ఎదుర్కొనేందుకు సత్తా ఉన్న నాయకులను దింపాలని చూస్తోంది. టీడీపీలో టిక్కెట్లు ఆశించి దక్కని నాయకులు వైసీపీ వైపు చూస్తుండంతో కొత్త నాయకులతో పార్టీకి ఊపు వచ్చినట్లయింది. సామాజికంగా - ఆర్థికంగా బలమున్న నేతలు వైసీపీలో చేరడం విశేషం.
ఇక విశాఖలో జనసేన పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ జిల్లాలో సీట్ల గెలుపుకంటే పార్టీలపై ఎక్కువ ప్రభావం చూపే పార్టీగా ఎదుగుతోంది. కార్మిక - కర్షక ఓట్లన్నీ జనసేన వైపు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కమ్యూనిస్టుల ప్రయాణంతో అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో బీజేపీలో ఉత్సాహం పెరిగింది.