Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ అనుమానం నిజమేనా?
By: Tupaki Desk | 29 Aug 2016 6:31 AM GMTతిరుపతిలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. అయితే... ఇంతకాలం నోరు మెదపని పవన్ రెండు రోజుల్లోనే సభను ప్లాన్ చేసి సక్సెస్ చేసుకోవడం వెనుక ఆయన టీమే ఉందా లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ సభ వెనుక టీడీపీ సపోర్టు ఉందని వారు అనుమానిస్తున్నారు. అది నిజమనడానికి వారు కారణాలు కూడా చెబుతున్నారు. తన అభిమాని చనిపోయాడని పరామర్శ కోసం తిరుపతి వెళ్లిన పవన్ … అక్కడే బస చేసి హఠాత్తుగా సాయంత్రం సభ ఉందని ప్రకటించడం.. ఆ వెంటనే అందరికీ మెసేజిలు వెళ్లడం.. వేదిక వెతకడం - అనుమతులు తీసుకోవడం అన్నీ జరిగిపోయాయి. అయితే.. తిరుపతిలో పవన్ కోసం అంతలా ఏర్పాట్లు చేయగలిగే అభిమానులు లేరని.. జనసేనలోనూ అంత ర్యాపిడ్ గా ఏర్పాట్లు చేసేవారు లేరని చెబుతున్నారు. దీంతో వేళ్లన్నీ టీడీపీవైపే చూపిస్తున్నాయి.
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్- వైసీపీలు ఇప్పటికే కొంత మైలేజి సంపాదించడంతో వారు మొత్తంగా ప్రత్యేక హోదా అంశాన్ని హైజాక్ చేయకుండా పవన్ ను రంగంలోకి దించినట్లుగా అనుమానిస్తున్నారు. టీడీపీ అండ లేకుంటే ఒక్క రోజులో ఏర్పాట్లు జరగడం కష్టమని అంటున్నారు. వేల సంఖ్యలో అభిమానులు చేరుకోవడం.. వారికి వాహనాలు సమకూరడం.. సభకు అనుమతులు అన్నీ శరవేగంగా జరగడానికి కారణం టీడీపీ సపోర్టేనని తిరుపతి వైసీపీ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు.. సభలో పవన్ మాట్లాడింది కూడా చంద్రబాబు ఆమోద ముద్ర పడిన ఉపన్యాసమేనని.. అందుకే అందులో బీజేపీ , కాంగ్రెస్ పై విమర్శలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తెర వెనుక తానున్నానన్న అనుమానం రాకుండా ఉండటానికే టీడీపీపైనా విమర్శలు చేశారని అంటున్నారు. మొత్తానికి బహిరంగంగా పవన్ సభ పెట్టినా.. రహస్యంగా చంద్రబాబే ఆపరేట్ చేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.