Begin typing your search above and press return to search.
చేసేది చెప్పుకోలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం!
By: Tupaki Desk | 4 May 2020 1:00 PM GMT‘6 నెలల్లో దేశంలోనే ఒక మంచి సీఎం అనిపించుకుంటాను’ అని గద్దెనెక్కగానే ఏపీ సీఎం జగన్ ప్రతిజ్ఞ చేశారు. అందులో భాగంగానే తొలి ఆరు నెలల్లోనే ప్రజలపై సంక్షేమ జల్లు కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చారు. మాట తప్పకుండా ‘నవరత్నాలు’ పథకాలన్నీ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఏపీ ప్రజల సంక్షేమమే ముఖ్యమని ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించారు. ఈ క్రమంలోనే దాదాపు ప్రతీ 2 వేల మంది ప్రజలకు ఒక గ్రామ సెక్రెటేరియట్ ఏర్పాటు చేసి.. ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను రిక్రూట్ మెంట్ చేసుకొని ఏ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా అన్ని ఉద్యోగాలు కలిపి 4 లక్షలకు పైగా ఏపీ సీఎం జగన్ ఇచ్చి ఔరా అనిపించారు. నిరుద్యోగుల పాలిట ఆశాదీపంగా మారారు జగన్.
అయితే సడన్ గా.. ఊహించని విధంగా కరోనా వచ్చేసింది. అయినా ఇన్ని కష్టాలు వచ్చినా ఎవరికి తక్కువ చేయకుండా వ్యయప్రయాసలకోర్చి పేద ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాహసం చేయనప్పుడు అమెరికా దేశం రాపిడ్ కిట్స్ కొన్న దక్షిణ కొరియా నుంచి అందరికంటే ముందు ఈ కిట్స్ లు కొని దిగుమతి చేసుకొని ఏపీ జనాలకు కరోనా టెస్టులు చేయించారు జగన్. సీఎం జగన్ ముందుచూపుకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
కానీ ఎన్ని చేస్తున్నా ఏపీ సీఎంకు కింది స్థాయి నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ అందించలేకపోతున్నారు. తన టీమ్ లోనే అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు సీఎం జగన్ కు సరైన సమాచారం ఇస్తున్నట్టు లేదు. ఎందుకంటే ఇంత చేస్తున్న ఏపీ సీఎం కి.. దేశంలో ఉన్న అన్ని జాతీయ మీడియా సంస్థలు ఫోకస్ చేయడం లేదు. పీఆర్వోలు కానీ మీడియా మేనేజ్ మెంట్ కానీ.. సలహాదారులు కానీ నాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు అని సమాచారం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సీఎం ఈ విధంగా ప్రజలకు మేలు చేయాలి అని ఆలోచన చేస్తున్న సీఎం జగన్ కు తన సహచరుల నుంచి సపోర్టు కరువైందంటున్నారు. వారి నుంచి సరైన సమాచారం లేని కారణంగా జగన్ బాగా చేస్తున్నా ఈ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు.
మీడియా మేనేజ్ మెంట్ సరిగా లేక.. పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేసుకోలేక.. బూత్ కమిటీ అస్సలు పట్టించుకోకపోవడం.. ఈ విధంగా సీఎం బాగా చేస్తున్నా.. పార్టీ కానీ.. ప్రభుత్వంలో పీఆర్వోలు కానీ సీఎంకు ఉన్న సలహాదారులు సరైన సమాచారం ఇవ్వలేని కారణంగా సీఎం జగన్ కు దేశంలో తగినంత ఆదరణ లేకుండా పోతోంది. కొంతమంది సీఎంలు ప్రజలకు ఏమీ చేయకపోయినా వాళ్ల పీఆర్వోల మీడియా మేనేజ్ మెంట్ వల్ల పేరు - ప్రచారం తెచ్చుకుంటున్నారని సమాచారం. ఏపీ సీఎం ఇప్పటికైనా మంచి పీఆర్వోలను.. సలహాదారులను - మీడియా మేనేజ్ మెంట్ ను పెట్టుకుంటే దేశంలోనే నంబర్ సీఎంగా జగన్ అయ్యే చాన్స్ ఉందని మేధావులు అంటున్నారు.