Begin typing your search above and press return to search.
సీమ టీడీపీ లో వైసీపీ ఫ్యాన్స్
By: Tupaki Desk | 7 Dec 2019 6:53 AM GMTరాయలసీమ టీడీపీ లో కోవర్టులు ఎక్కువయ్యారట. కొంతమంది నాయకులు టీడీపీ లోనే ఉంటూ వైసీపీ కి అనుకూలంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు గుర్తించారట. తమ సొంత ప్రయోజనాలు, పనులను చక్కబెట్టుకునేందుకు ఈవిధంగా చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం చంద్రబాబు కు చేరిందని, ఇలాంటి వారిని ఉపేక్షిస్తే పార్టీ మనుగడకే ప్రమాదమని భావించి చర్యలు తీసుకునేందుకు ఆయన పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీని అనేక మంది నేతలు వీడుతుండటంతో చంద్రబాబు జిల్లాల పర్యటన కు శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.
నియోజక వర్గాల వారీగా సమీక్షించి శ్రేణుల్లో మనోధైర్యం నింపారు. దీంతో వైసీపీలోకి వలసలను కొద్దిగా కట్టడి చేయగలిగారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు గా కొత్తవారిని నియమించడం తో వైసీపీకి ధీటుగా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాయలసీమ జిల్లాలకు వెళ్లిన చంద్రబాబుకు పార్టీలో చీలికలు..పాలికలు..వర్గ విబేధాలు కొట్టొచ్చినట్లు స్పష్టం గా కనిపించాయట.
అదే సమయంలో పార్టీలో కొంతమంది కోవర్టులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇందులో స్వతహాగా వైసీపీపై అభిమానంతో పనిచేస్తుండగా, మరికొంతమంది మాత్రం తమ వ్యాపారాలు, ఆస్తులను రక్షించుకునేందుకు భవిష్యత్ రాజకీయం ఆశించి ఈవిధంగా ఆ పార్టీ కి సహకరిస్తున్నారని చంద్రబాబుకు పూర్తి సమాచారం అందడం గమనార్హం. ఒకప్పుడు టీడీపీ కి కంచు కోటలాగా ఉండే రాయలసీమ జిల్లాలో పార్టీ నానాటికి ప్రాభవాన్ని కోల్పోతూ గత ఎన్నికల్లో మూడంటే మూడే సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది.
అయితే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ట్రెండ్ కొనసాగడం... ఆ ప్రభావం సీమ టీడీపీ రాజకీయాలపైనా ప్రభావం చూపిందని చంద్రబాబు సర్దుకుపోయారట. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోవర్టులపై చర్యలు తీసుకోకపోతే రాయలసమీ జిల్లాల్లో ఇబ్బందులు ఎదురు కావడం తథ్యమని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకే ముందే కోవర్టులను ఏరిపారేసి నిజాయితీతో పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్కరమని యోచిస్తున్నారట. చూడాలి ఏం జరుగుతుందో..!