Begin typing your search above and press return to search.
అట్టర్ ప్లాప్ బాబు..దమ్ముంటే ఎన్నికలకు రా
By: Tupaki Desk | 8 Jun 2018 3:37 PM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా...పార్లమెంటు సభ్యత్వాలను తృణప్రాయంగా వదులుకున్న వైఎస్ ఆర్ సీపీ ఎంపీలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ మండిపడింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - ఎమ్మెల్యే - గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అభివృద్ధి - సంక్షేమం పెట్టిన చంద్రబాబు నాలుగేళ్ల సినిమా ఫ్లాప్ అయ్యిందని - ప్రమోషన్లతో కాలయాపన చేస్తున్నారని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నారు..బీసీలు జడ్జీలు కాకుండా అడ్డుకున్నారన్నారు. ఇనాటికి మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇంతవరకు గిరిజన కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు.
వైఎస్ ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఛార్జ్ షిట్ ను వైఎస్ ఆర్ సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - గడికోట శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిలపడ్డారన్నారు. వైఎస్ ఆర్ సీపీ చార్జ్ షీట్ - టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు సరిచూసుకోవాలన్నారు. చంద్రబాబు ఇసుక - మైనింగ్ - మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని ఫైర్ అయ్యారు. 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఆ సమయంలో పెట్టిన మొదటి ఐదు సంతకాలకు ఇంతవరకు మోక్షం లేదన్నారు. మొదటి సంతకాలకు ఉన్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారన్నారు. జూన్ 4వ తేదీన ఎస్ ఎల్ బీసీ మీటింగ్ లో రుణాలు మాఫీ చేయబోతున్నారని చెప్పిన చంద్రబాబు రూ.87 వేల కోట్ల రైతు రుణాలను రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు. కమిటీలు వేసి మాఫీ చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 8 - 2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రుణమాఫీపై చేసిన మొదటి సంతకానికి ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి తెస్తామన్నారు. రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కాగానే కోటయ్య కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు మాఫీ చేయకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. రుణాలు మాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
పోలవరంకు అనుమతులు తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన తవ్విన కాల్వలకు పట్టిసీమ - పురుషోత్తం ఎత్తిపోతల పథకం అని పేర్లు పెట్టుకున్నారన్నారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి తలసరి ఆదాయం పెంచుతానని చంద్రబాబు కళ్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. 2050లో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేవలం పబ్లిషిటి స్టంట్ తో ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఎవరైనా ఆట బాగా ఆడితే నేనే నేర్పించానని పబ్లిషిటి కోసం తహతహలాడుతున్నారన్నారని ఫైర్ అయ్యారు.