Begin typing your search above and press return to search.

కుప్పంలో వైసీపీ ప్లాన్ బి.. సక్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   11 May 2019 5:48 AM GMT
కుప్పంలో వైసీపీ ప్లాన్ బి.. సక్సెస్ అయ్యేనా?
X
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం.. టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నేళ్లుగా పోటీచేస్తున్న ప్రాంతం.. అక్కడ ప్రత్యర్థి పార్టీ వైసీపీ గెలవడం అసాధ్యమే.. బాబును ఓడించడం కల్లా.. అందుకే ఇప్పుడు అక్కడ ప్లాన్ బి అమలు చేసిందట వైసీపీ. ఇంతకీ వైసీపీ అమలు చేసిన ఆ ప్లాన్ ఏంటంటే క్రాస్ ఓటింగ్..

చిత్తూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014లో టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ హవా నడిచింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అయినా చిత్తూరు పార్లమెంట్ సీటును మాత్రం వైసీపీ గెలుచుకోలేకపోయింది. శివప్రసాద్ చిత్తూరు ఎంపీగా రెండో సారి టీడీపీ నుంచి గెలిచారు. ఇది ఎలా సాధ్యమైందంటే.. అంతా కుప్పం మహిమ.. కుప్పంలో చంద్రబాబుకు పడ్డ ఏకపక్ష ఓట్లన్నీ చిత్తూరు ఎంపీకి పడి ఆయన గెలుపునకు దోహనం పడిందన్నమాట..

1996 నుంచి టీడీపీకి చిత్తూరు పార్లమెంట్ స్థానం కంచుకోటగా మారింది. అక్కడ వరుసగా గెలుస్తూ వస్తోంది... శివప్రాసాద్ 2009,2014లో ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా పోటీచేసి గెలుపు ధీమాతో ఉన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంపైనే ఆయన ఆశలు పెంచుకున్నారు.

ఇక చిత్తూరు పార్లమెంట్ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని సీనియర్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. వైసీపీ టికెట్ ను తన అనుచరుడైన రెడ్డప్పకు ఇప్పించుకున్నారు. కుప్పం నుంచి బలమైన చంద్రమోళిని చంద్రబాబుపై పోటీకి దింపారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడం అసాధ్యమైనా కానీ క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించి చిత్తూరు ఎంపీ సీటును వైసీపీ గెలుచుకునేలా పెద్దిరెడ్డి ప్లాన్ చేశారు. అసెంబ్లీకి చంద్రబాబుకు, పార్లమెంట్ కు వైసీపీ కి పడేలా సామాజిక సమీకరణాలతో ఎరవేశారు. ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. మరి మే 23న ఫలితాల్లో ఈ క్రాస్ ఓటింగ్ చిత్తూరు ఎంపీ సీటుపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది.. వైసీపీ అభ్యర్థి గెలుస్తాడా లేడా అన్నది వేచిచూడాలి.