Begin typing your search above and press return to search.
ముప్పయి మంది ఎమ్మెల్యేలు జంప్...నిఘా పెట్టిన వైసీపీ...?
By: Tupaki Desk | 14 Nov 2022 6:39 AM GMTఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఇక ఎన్నికల వేడి వచ్చేసింది. నిజానికి మరో ఏడాదికి పైగా ఎన్నికలకు సమయం ఉన్నా ఇప్పటినుంచే అన్ని పార్టీలు సర్దుకుంటున్నాయి. అదే సమయంలో రాజకీయ జీవులు కూడా తమ భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలు చేస్తున్నరు. తాము ఏ పార్టీలో ఉంటే వచ్చే ఎన్నికల్లో నెగ్గగలమన్న దాని మీద ఎవరి మటుకు వారు లెక్కలు వేసుకుంటున్నారు.
అధికార వైసీపీలో చూస్తే 151 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో అయిదారుగురు మద్దతు ఇచ్చే వారు ఉన్నారు. వీరందరికీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్లు లభిస్తాయని ఎవరూ అనుకోవడంలేదు. సగానికి సగం మందికి టికెట్లు రావు అని ప్రచారం సాగుతోంది. డిసెంబర్ లో వైసీపీ నిర్వహించే వర్క్ షాప్ లో ఆ విషయం మీద ఒక స్పష్టత వస్తుందని అంటున్నారు.
ఇక ఇప్పటికే అధినాయకత్వం నుంచి వస్తున్న సూచనలు సంకేతాలను ఆధారం చేసుకుని తమకు టికెట్లు రావు అని భావిస్తున్న వారు, వచ్చినా గెలవమని అంచనా కడుతున్న వారు, ప్రత్యర్ధి పార్టీలు రాజకీయంగా బలంగా ఉన్నాయని లెక్కలేసుకుంటున్న వారు వైసీపీ గూడు దాటి బయటకు వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే వీరి సంఖ్య పాతిక నుంచి ముప్పయి దాకా ఉండవచ్చు అని అంటున్నారు.
మరి ఎవరెవరు పార్టీని వీడతారు, వారి పరిస్థితి ఏమిటి. వారిని ఆకర్షిస్తున్న పార్టీలు ఏమిటి అన్న దాని మీద వైసీపీ కూడా గట్టి నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికార పార్టీలో కుదుపు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. అక్కడ జనసేన, టీడీపీ రెండూ కూడా వేటికవే బలంగా ఉన్నాయి. ఇక పొత్తులు కనుక కుదిరితే వార్ వన్ సైడ్ అయినా అశ్చర్యం లేదు అని అంటున్నారు.
దాంతో ఆయా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు పార్టీ మారుతారు అని గుసగుసలు అయితే అధికార పార్టీలో ఉన్నాయి. దాంతో పాటుగా గుంటూరు నుంచి క్రిష్ణా జిల్లాల నుంచి కూడా పార్టీ మారే వారు ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇక విశాఖ నుంచి కనీసంగా ఇద్దరు ముగ్గురు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తారని అంటున్నారు. అదే విధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా పార్టీ మారే వారు ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది.
చిత్రమేంటి అంటే వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వీరు తాజా మాజీలా లేక సీనియర్ మాజీలా అన్నది తెలియాల్సి ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ కూడా ఇంటలిజెన్స్ వర్గాల నుంచి ఎవరెవరు పార్టీ నుంచి ఫిరాయిస్తారు అన్న కీలకమైన సమాచారం తెప్పించుకుంటోంది అన్న ప్రచారం సాగుతోంది. అలాగే అనుమానం ఉన్న వారి మీద నిఘా కూడా పెడుతుననరని అంటున్నారు.
నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కొందరితే రాజకీయ సామాజిక తన ప్రాంతాల పరిస్థితుల కారణంగా ఈసారి వైసీపీ నుంచి గెలవలమని భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో వారు తమ భవిష్యత్తుని చూసుకునేందుకు జంప్ చేస్తారని అంటున్నారు. అయితే జనసేన టీడీపీల మధ్య పొత్తులు కనుక కుదిరితే అపుడు ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారుట.
అంతవరకూ లోపాయికారిగానే వ్యవహరిస్తూ ప్రత్యర్ధి పార్టీలలో తమ స్థానాన్ని సేఫ్ జోన్ లో ఉంచుకోవడానికి చూస్తున్నారు అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇది ప్రచారంగా బయటకు వచ్చినా ఒక పార్టీ నుంచి ఏకంగా ముప్పయి మంది దాకా ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళడం అంటే అతి పెద్ద కుదుపుగానే చూడాలి. మరి వైసీపీలో నిజంగా ఆ పరిస్థితి ఉందా. అంతమంది గోడ దాటుతారా. ఇది కేవలం పుకారు మాత్రమేనా అంటే రానున్న రోజులలో జరగబోయే పరిణామాలే దీనికి జవాబు చెబుతాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.